ఒమన్, కువైట్, ఖతార్‌ పాలకులకు మోదీ ఫోన్‌

Published on Wed, 03/04/2026 - 04:27

న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, గల్ఫ్‌ దేశాలపై దాడులు కొనసాగుతుండడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. ఆయన మంగళవారం ఒమన్‌ సుల్తాన్‌ హైతమ్‌ బిన్‌ తారిఖ్, కువైట్‌ యువరాజు షేక్‌ సబా అల్‌–ఖలీద్‌ అల్‌–హమద్‌ అల్‌–ముబారక్‌ అల్‌–సబా, ఖతార్‌ రాజు షేక్‌ తమీమ్‌ బిన్‌ హమద్‌ అల్‌ థానీతో ఫోన్‌లో మాట్లాడారు. తాజా పరిస్థితిపై వారితో చర్చించారు. మూడు దేశాలపై దాడులతోపాటు సార్వబౌమత్వం, ప్రాదేశిక సమగ్రతల ఉల్లంఘన జరుగుతుండడాన్ని మోదీ తీవ్రంగా ఖండించారు. 

ఆయా దేశాల్లో నివసిస్తున్న భారతీయుల సంక్షేమం, భద్రతపై చర్చించారు. భారతీయులకు తగిన రక్షణ కల్పించడానికి చర్యలు చేపట్టాలని కోరారు. ప్రధాని మోదీ గత రెండు దేశాల్లో పశ్చిమాసియాలో ఎనిమిది దేశాల అధినేతలతో మాట్లాడారు. ప్రధానంగా భారతీయుల భద్రతని వారి దృష్టికి తీసుకెళ్లారు. మంగళవారం ఒమన్, కువైట్, ఖతార్‌ దేశాల పెద్దలతో మాట్లాడినట్లు మోదీ ‘ఎక్స్‌’లో పోస్టుచేశారు.

పశ్చిమాసియాలో సాధ్యమైనంత త్వరగా శాంతి, స్థిరత్వం నెలకొనాలని తాము కోరుకుంటున్నట్లు వెల్లడించారు. వివాదాలను దౌత్య మార్గాల్లో చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని స్పష్టంచేశారు. భారతీయుల రక్షణ విషయంలో మద్దతు ఇస్తున్నందుకు మూడు దేశాల అధినేతలకు కృతజ్ఞతలు తెలియజేసినట్లు పేర్కొన్నారు. 

Videos

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)