Breaking News

ప్రధాని మోదీ ఐదు దేశాల పర్యటన షురూ.. షెడ్యూల్‌ ఇదే..

Published on Wed, 07/02/2025 - 08:54

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ ఐదు దేశాల విదేశీ పర్యటనకు బుధవారం శ్రీకారం చుట్టారు. తొలుత ఆయన ఢిల్లీ నుంచి ఘనాకు విమానంలో బయలుదేరారు. నేటి నుంచి జూలై 9 వరకు  ప్రధానమంత్రి మోదీ విదేశీ పర్యటన సాగనుంది. తన పర్యటనలో భాగంగా ఆయన నేడు,  రేపు ఘనాను సందర్శించనున్నారు.

మూడు దశాబ్దాల తర్వాత ఒక భారత ప్రధాని ఘనాలో పర్యటించడం ఇదే తొలిసారి. ఘానా అధ్యక్షునితో ప్రధాని మోదీ ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు. ఆర్ధిక, ఎనర్జీ, డిఫెన్స్ పరస్పర సహకారంపై చర్చ జరగనుంది. జూలై 3-4 తేదీల్లో ట్రినిడాడ్, టోబాగోలో ప్రధాని  పర్యటించనున్నారు. ఈ సందర్బంగా ఆయన ట్రినిడాడ్ అధ్యక్షురాలు, ప్రధాని బిసెసర్‌తో భేటీ కానున్నారు. అలాగే ట్రినిడాడ్ పార్లమెంటులో సంయుక్త సభను ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు.
 

జూలై 4-5 తేదీల్లో అర్జెంటీనాలో ప్రధాని మోదీ పర్యటన సాగనుంది. అర్జెంటీనా అధ్యక్షుడు జావియర్ మిలేయ్‌తో సమావేశం కానున్నారు. ఈ సందర్బంగా డిఫెన్స్, ఖనిజాలు, వ్యవసాయం, ఎనర్జీ, వాణిజ్యంపై చర్చ జరపనున్నారు. ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతంపై చర్చించనున్నారు.  జూలై 5-8 తేదీల్లో బ్రెజిల్‌లో 17వ ‘బ్రిక్స్‌’ శిఖరాగ్ర సమావేశంలో భారత ప్రధాని పాల్గొననున్నారు.  ప్రపంచ శాంతి, గ్లోబల్ గవర్నెన్స్, ఏఐ, వాతావరణ మార్పులపై బ్రిక్స్ సదస్సులో చర్చ జరగనుంది. అదే సమయంలో బ్రెజిల్ అధ్యక్షుడు లులాతో కూడా ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. జూలై 9న జరిగే నమీబియా పర్యటనలో ప్రధాని మోదీ అక్కడి పార్లమెంటులో ప్రసంగించనున్నారు. 
 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)