Breaking News

ప్రైవేట్‌ ఉద్యోగస్తులకు ప్రధాని మోదీ బంపరాఫర్‌

Published on Fri, 08/15/2025 - 09:22

సాక్షి,న్యూఢిల్లీ: రోజువారీ వినియోగించే వస్తువులపై విధించే పన్నును తగ్గించడంతో పాటు దేశంలో యువత కోసం రూ.లక్ష కోట్లతో కొత్త పథకాన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు.

ఢిల్లీ ఎర్రకోట వేదికగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘నా దేశ యువత కోసం ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్‌ యోజన (Pradhan Mantri Viksit Bharat Rozgar Yojana) పేరుతో ఈ కొత్త పథకం అందుబాటులోకి తెస్తున్నాం. ఈ కొత్త పథకం ఈ రోజు నుంచే అమలులోకి వస్తోంది. ఈ పథకం కింద, ప్రైవేట్ రంగంలో మొదటి ఉద్యోగం పొందుతున్న యువతకు రూ.15,000 ఆర్థిక సహాయం అందిస్తున్నాం. తద్వారా ద్వారా 3.5 కోట్లకు పైగా యువతకు ఉపాధి అవకాశాలు కలుగనున్నాయి. ఉద్యోగ అవకాశాలు కల్పించే కంపెనీలకు తగిన ప్రోత్సాహకాలు కూడా ఇవ్వనున్నట్లు వెల్లడించారు.  

రూ.15 వేలు కేంద్రం ఎలా ఇస్తుంది 
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)లో తొలిసారిగా రిజిస్టర్ చేసుకున్న ఉద్యోగులకు రెండు విడతలుగా రూ. 15,000 వరకు పొందవచ్చు.  రూ. లక్ష వరకు జీతం ఉన్న ఉద్యోగులు అర్హులు. ఆరు నెలల సర్వీస్ తర్వాత మొదటి విడత .. మరో ఆరునెలల సర్వీస్‌లో రెండో విడుత కింద అందిస్తుంది.

రూ.15వేలను ఎలా డ్రా చేసుకోవచ్చు
సేవింగ్స్‌ను ప్రోత్సహించేలా కేంద్రం అందించే రూ.15వేలులో కొంత మొత్తాన్ని ఈపీఎఫ్‌ ఖాతాలో నిర్ణీత కాలం వరకు ఉంచుతుంది. ఆ తర్వాత మొత్తాన్ని సదరు ఉద్యోగి విత్‌ డ్రా చేసుకోవచ్చు. ఈ చెల్లింపు ఆధార్ బ్రిడ్జ్ పేమెంట్ సిస్టమ్ (ABPS) ఉపయోగించి డీబీటీ (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్) మోడ్ ద్వారా జరుగుతాయి.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)