Breaking News

దేశ ప్రగతికి ‘డబుల్‌ డోసు’ 

Published on Thu, 09/04/2025 - 19:15

న్యూఢిల్లీ:  వస్తు సేవల పన్ను(జీఎస్టీ)లో ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తంచేశారు. దేశ అభివృద్ధికి ఇది ‘డబుల్‌ డోసు’ మద్దతు అని తేల్చిచెప్పారు. 2004 నుంచి 2014 దాకా కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో పన్నుల విధానం గందరగోళం ఉండేదని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత పన్నుల వ్యవస్థను సంస్కరించి, సరళీకృతం చేశామని పేర్కొన్నారు.

 జీఎస్టీలో తాజా సంస్కరణలను ప్రసార మాధ్యమాలు ‘జీఎస్టీ 2.0’గా అభివరి్ణస్తున్నాయని తెలిపారు. తాజా మార్పులతో రెండు విధాలుగా లబ్ధి కలుగుతుందని వివరించారు. సాధారణ ప్రజలకు డబ్బు ఆదా కావడంతోపాటు దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని.. అందుకే ఇది డబుల్‌ డోసు అని స్పష్టంచేశారు. గురువారం ఢిల్లీలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపికైన విజేతలతో మోదీ మాట్లాడారు. జీఎస్టీలో సంస్కరణలతో సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని తెలియజేశారు. 

ఆయన ఇంకా ఏం చెప్పారంటే...  
‘‘దేశం స్వయం సమృద్ధి సాధించాలి. అందుకోసం తదుపరి తరం సంస్కరణలను ఆపే ప్రసక్తేలేదు. దేశ ప్రజలకు డబుల్‌ ధమాకా ఇస్తానని ఎర్రకోట నుంచి హామీ ఇచ్చా. సెపె్టంబర్‌ 22న నవరాత్రుల తొలి రోజు నుంచే ఈ ధమాకా అందుబాటులోకి రాబోతోంది. దేశ చరిత్రలో ఇదొక మైలురాయి.   గత కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ప్రజలపై అధిక పన్నులు విధించాయి. వంట గదిలో వాడుకొనే వస్తువులను, ఆఖరికి ఔషధాలను కూడా వదిలిపెట్టలేదు. అప్పటి పాలన ఇంకా కొనసాగుతూ ఉంటే రూ.100 విలువైన వస్తువు కొనుగోలుపై రూ.25 పన్ను చెల్లించాల్సి వచ్చేది.

 ప్రజల చేతుల్లో డబ్బులు మిగిల్చి, వారి జీవితాలను మెరుగుపర్చాలన్న ధ్యేయంతో మేము పని చేస్తున్నాం. ఆన్‌లైన్‌ మనీ గేమింగ్‌ను నియంత్రించడానికి కొత్త చట్టం తీసుకొచ్చాం. ఈ విషయంలో మాపై ఒత్తిళ్లు వచ్చినా వెనక్కి తగ్గలేదు. యువత భవిష్యత్తుకు భద్రత కల్పించాలని నిర్ణయించాం. గేమింగ్‌ అనేది చెడ్డది కాకపోయినా అదే పేరుతో జూదం ఆడడం ప్రమాదకరమే. ఆన్‌లైన్‌ గేమింగ్‌ సరైన రీతిలో నిర్వహిస్తే గ్లోబల్‌ మార్కెట్‌లో మన దేశమే నంబర్‌ వన్‌ అవుతుంది. మన దేశ ప్రగతి కోసం విద్యార్థులు, ఉపాధ్యాయులు స్వదేశీ ఉత్పత్తులే ఉపయోగించుకోవాలని మరోసారి కోరుతున్నా’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.      

 

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)