Breaking News

ప్రధాని మోదీ భావోద్వేగం..

Published on Sat, 08/26/2023 - 12:02

బెంగళూరు: ప్రతిష్టాత్మక చంద్రయాన్-3ని విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ బెంగుళూరు చేరుకున్నారు. చంద్రయాన్ 3లో పాల్గొన్న శాస్త్రవేత్తలను ఉద్దేశించి ఇస్రో కమాండ్ సెంటర్‌లో మాట్లాడారు. ఈ క్రమంలో ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. భారత్ చంద్రునిపైకి చేరుకుందని అన్నారు. జాతి గౌరవాన్ని చంద్రమండలం వరకు తీసుకువెళ్లామని చెప్పారు. భారత అంతరిక్ష కార్యక్రమాల్లో చంద్రయాన్ 3 మిషన్ ఓ అద్భుత ఘట్టం అని అన్నారు. 

40 రోజుల ప్రయాణం తర్వాత చంద్రయాన్ 3 ల్యాండర్ విక్రమ్ జాబిల్లి దక్షిణ ధృవాన్ని బుధవారం చేరింది. ప్రజ్ఞాన్ రోవర్ కూడా బయటకు వచ్చి వివరాలను సేకరించే పనిని ప్రారంభించింది. అయితే.. చంద్రయాన్ 3 ల్యాండర్ జాబిల్లిని చేరినప్పుడు ప్రధాని మోదీ బ్రిక్స్ సదస్సుకు హాజరవడానికి దక్షిణాఫ్రికా వెళ్లారు. అనంతరం ద్వైపాక్షిక సంబంధాల్లో భాగంగా గ్రీస్‌కు వెళ్లారు. 

నేరుగా గ్రీస్‌ నుంచి నేడు బెంగళూరుకు చేరుకున్నారు. ఇస్రో టెలిమెట్రి ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్‌కు వెళ్లారు. అక్కడ శాస్త్రవేత్తలతో ముచ్చటించారు. ఈ ప్రయోగంలో శాస్త్రవేత్తల ధైర్యసాహసాలను మెచ్చుకున్నారు. సాహసోపేతమైన ఘట్టంగా అభివర్ణించారు. కేవలం భారతీయులకే గాక యావత్ ప్రపంచ విజ్ఞానానికి ఉపయోగం ఉంటుందని అన్నారు. 

ఇదీ చదవండి: PM Modi ISRO Visit Highlights: బెంగళూరులో మోదీ.. 'జై విజ్ఞాన్, జై అనుసంధాన్' నినాదాలు

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)