Breaking News

చంద్రబాబుకి అంత టైమిస్తారా?.. నీతి ఆయోగ్‌ మీటింగ్‌ నుంచి మమతా బెనర్జీ వాకౌట్‌

Published on Sat, 07/27/2024 - 09:08

సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్‌ సమావేశంలో ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. గవర్నింగ్  కౌన్సిల్ సమావేశానికి హాజరైన పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి,  టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఉన్నపళంగా బయటకు వచ్చి.. వాకౌట్‌ చేస్తున్నట్లు మీడియాకు చెబుతూ వెళ్లిపోయారామె.

‘‘విపక్షాల నుంచి హాజరైంది నేను మాత్రమే. కేవలం ఐదు నిమిషాలు మాత్రమే మాట్లాడనిచ్చారు. మాట్లాడే టైంలో నా మైక్‌ను కట్‌ చేశారు. నీతి ఆయోగ్‌ సమావేశంలో చం‍ద్రబాబు 20 నిమిషాల పాటు మాట్లాడారు. బీజేపీ రాష్ట్రాలకు చాలా టైం ఇచ్చారు. ఇది ప్రాంతీయ పార్టీలను అవమానించడమే.  ఇదేం నీతి?. అందుకే నిరసనగా బయటకు వచ్చేశా’’ అని అన్నారామె. 

అలాగే.. బడ్జెట్‌లో కేంద్రం వివక్ష చూపిందని, బడ్జెట్‌ రాజకీయంగా ఉందని అభిప్రాయపడ్డారామె. ‘‘బడ్జెట్‌ విషయంలో బెంగాల్‌నూ అవమానించారు. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు నిధులు ఇవ్వలేదు. ఈసారి బడ్జెట్‌ పూర్తి రాజకీయంగా ఉంది’’ అంటూ ఆమె కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇక.. నీతి ఆయోగ్‌ను రద్దు చేసి స్థానంలో ప్రణాళిక సంఘాన్ని పునరుద్ధరించాలని పేర్కొంటూ ఆమె డిమాండ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే మీటింగ్‌ హాజరై ఆమె కేంద్రాన్ని నిలదీస్తానని ఆమె ప్రకటించారు కూడా.

ఇదిలా ఉంటే.. రాష్ట్రపతి భవన్‌ కల్చరల్‌ సెంటర్‌లో ప్రధాని నేతృత్వంలో నీతి ఆయోగ్‌ భేటీ జరుగుతోంది. ‘వికసిత్ భారత్ - 2047’ ప్రధాన ఎజెండాగా ఈ భేటీ జరుగుతోంది. దీనికి కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. అయితే.. బడ్జెట్‌ కేటాయింపుల్లో కేంద్రం వివక్ష ప్రదర్శించిందని ఆరోపిస్తూ  ఇండియా కూటమి తరఫున ముఖ్యమంత్రులు(ఆరుగురు) మాత్రం ఈ భేటీని బహిష్కరించారు. 

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)