‘మహా కుంభమేళాను పొడిగించండి’

Published on Sat, 02/15/2025 - 16:38

ప్రపంచంలోనే అత్యంత భారీ ఆధ్యాత్మిక సమ్మేళనం మరో 11 రోజుల్లో ముగియనుంది. ప్రయాగ్‌రాజ్‌ మహా కుంభమేళాను ఇప్పటిదాకా(శుక్రవారం సాయంత్రానికే) 50 కోట్ల మంది హాజరైనట్లు యూపీ ప్రభుత్వం ప్రకటించుకుంది. ఇది అమెరికా, రష్యా లాంటి అగ్రరాజ్యల జనాభా కంటే అధికం. అయితే..

మహా కుంభమేళాలో పవిత్ర స్నానాలు ఆచరించేందుకు ఇంకా కోట్ల మంది ప్రయాగ్‌రాజ్‌ వైపు అడుగులేస్తున్నారు. ఈ క్రమంలో కుంభ మేళాను పొడిగించాలనే డిమాండ్‌ తెర మీదకు వచ్చింది. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌(Akhilesh Yadav) కుంభమేళాను మరికొన్ని రోజులు పొడిగించాలని ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

గతంలో మహా కుంభమేళా, కుంభమేళాల రద్దీ  దృష్ట్యా 75 రోజులపాటు నిర్వహించిన దాఖలాలు ఉన్నాయి!. కానీ, ఇప్పుడు నిర్వహిస్తున్న మహా కుంభమేళా(Maha Kumbh Mela) తక్కువ రోజులు నిర్వహిస్తున్నారని అఖిలేష్‌ అంటున్నారు. మహా కుంభమేళా కోసం ఎంతో మంది ఆశగా ప్రయాగ్‌రాజ్‌ వైపు వస్తున్నారు. ఈ క్రమంలో వాళ్లను నిరాశపర్చడం సరికాదు. కుంభమేళాను మరికొన్ని రోజులు పొడిగించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా అని అన్నారాయన.

ఇదిలా ఉంటే.. ఈసారి మహా కుంభమేళాలో తొక్కిసలాట విషాదం నెలకొంది. జనవరి చివరి వారంలో మౌనీ అమావాస్య సందర్భంగా భక్తులు ప్రయాగ్‌రాజ్‌ ఘాట్‌ల వద్ద ఎగబడడంతో బారికేడ్లు విరిగిపడ్డాయి. దీంతో తోక్కిసలాట జరగ్గా  ముప్ఫై మంది మరణించారు. అయితే.. మృతుల సంఖ్యను యూపీ ప్రభుత్వం దాస్తోందని అఖిలేష్‌ ఆరోపించారు. అంతేకాదు.. నిర్వహణ విషయంలో యోగి సర్కార్‌ విఫలైమందని, భారత సైన్యానికి కుంభమేళా బాధ్యతలను అప్పగించాలని డిమాండ్‌ చేశారు కూడా.   

మహా కుంభమేళా కోసం క్యూ కడుతున్న భక్తుల సంఖ్య తగ్గడం లేదు. రైళ్లు, బస్సులు నిండిపోయిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తున్నాయి. కిందటి వారం ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాఫిక్‌ జామ్‌ ప్రయాగ్‌ రాజ్‌(Prayag Raj) రూట్‌లో నెలకొనడం చూశాం. ఇంకోవైపు.. జనాల తాకిడితో ప్రయాగ్‌రాజ్‌ సంగమ రైల్వే స్టేషన్‌ను తాత్కాలికంగా మూసేశారు.

ఇదిలా ఉంటే.. జనవరి 13వ తేదీన పౌష పూర్ణిమతో మహా కుంభమేళా ఆరంభమైంది. కుంభమేళా అయినా, మహా కుంభమేళా అయినా గ్రహాల స్థితిగతులు.. శాస్త్రాలను.. తదితరాలను అనుసరించి 45 రోజులపాటు కొనసాగుతాయి. ఈ ఏడాది మహా కుంభమేళా.. ఫిబ్రవరి 26 శివరాత్రి పర్వదినంతో ముగియనుంది.

ఇదీ చదవండి: స్టార్‌ హీరో భద్రత విషయంలో ఇంత నిర్లక్ష్యమా?

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)