Breaking News

ఢిల్లీలో కాలుష్య నియంత్రణకు మరో ప్లాన్‌.. సుప్రీంకు వినతి!

Published on Thu, 11/09/2023 - 12:37

దేశరాజధాని ఢిల్లీలో కాలుష్య సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. తాజాగా కృత్రిమ వర్షాలు కురిపించే యోచనతో ఢిల్లీ ప్రభుత్వం.. ఐఐటీ కాన్పూర్‌ను సంప్రదించింది. ఈ నేపధ్యంలో ఐఐటీ కాన్పూర్ అందించిన ప్రతిపాదనను శుక్రవారం సుప్రీంకోర్టుకు సమర్పించనుంది.

ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ మాట్లాడుతూ కాలుష్యాన్ని తగ్గించేందుకు కృత్రిమ వర్షపాతం ఎంతో ప్రభావవంతంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారన్నారు. కృత్రిమ వర్షం కురిపించాలంటే కనీసం 40 శాతం మేరకు మేఘాలు ఆవరించాలని, నవంబర్ 20, 21 తేదీల్లో ఇటువంటి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని ఐఐటీ కాన్పూర్ బృందం తెలిపిందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలు వస్తే కేంద్ర ప్రభుత్వ అనుమతి కూడా తీసుకుని కృత్రిమ వర్షాలు కురిపించే ప్రక్రియను ప్రారంభిస్తామన్నారు. 

ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ వర్షాలపై పలు పరిశోధనలు జరుగుతున్నాయి. కృత్రిమ వర్షాలు కురిపించేందుకు సిల్వర్ అయోడైడ్‌ను ఆకాశంలో స్ప్రే చేయాల్సివుంటుంది. ఇది విమానం సహాయంతో ఆకాశంలో జరుగుతుంది. సిల్వర్ అయోడైడ్ అనేది మంచు లాంటిది. దీని కారణంగా తేమతో కూడిన మేఘాలలో నీటి పరిమాణం పెరుగుతుంది. ఫలితంగా ఈ మేఘాల నుండి వర్షం కురుస్తుంది. దీనినే క్లౌడ్ సీడింగ్ అని కూడా అంటారు.
ఇది కూడా చదవండి: 2100 నాటికి ప్రపంచ జనాభాలో భారీ తగ్గుదల?

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)