Breaking News

స్టార్టప్‌లపై నా వ్యాఖ్యలను వక్రీకరించారు: పీయూష్‌ గోయల్‌

Published on Sat, 04/05/2025 - 08:44

న్యూఢిల్లీ: భారత్ స్టార్టప్‌లను ఉద్దేశించి కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్‌ గోయల్(Piyush Goyal) చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. విమర్శించడం తేలికని, భారత్‌కు భారీస్థాయిలో ఏఐ మోడల్ ఎందుకు లేదో విశ్లేషించాలని, ఎదగడానికి ప్రయత్నిస్తున్నవారిని అణచి వేయకూడదని పలు కంపెనీల సీఈవోలు, గోయల్‌ వ్యాఖ్యలపై అభ్యంతరాలు కూడా వ్యక్తం చేశారు.

అయితే.. భారత స్టార్టప్‌ల(Indian Start Ups)ను తానేం తక్కువ చేయలేదని గోయల్‌ అంటున్నారు. చైనా తరహాలో ఏఐ వంటి అంశాలపై దృష్టి సారించాలని మాత్రమే తాను సూచించానని, దీనిపై పలు రకాల విమర్శలు రావడంతో కాంగ్రెస్‌ తన వ్యాఖ్యలను తప్పుగా ప్రచారం చేస్తోందని గోయల్‌ ఆరోపించారు.‘‘నేను చేసిన వ్యాఖ్యలు చాలామందికి సానుకూలంగానే తీసుకున్నారు. భారత్‌ పోటీ ప్రపంచంలో ముందు ఉండేందుకు సిద్ధమని నాతో చెప్పారు. కానీ, కొందరు మాత్రం నా వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారు’’ అని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో గోయల్‌ అన్నారు.

స్టార్టప్ మహాకుంబ్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి గోయల్‌ మాట్లాడుతూ.. దేశంలోని పలు స్టార్టప్‌ కంపెనీలు ఫుడ్ డెలివరీ, బెట్టింగ్, ఫాంటసీ స్పోర్ట్స్ వంటి యాప్‌లపై ఎక్కువగా దృష్టి సారించాయన్నారు. కానీ చైనాలోని స్టార్టప్‌లు మాత్రం ఇందుకు భిన్నమైన రంగాలను ఎంచుకుంటున్నాయని చెప్పారు. కానీ, మనం ఐస్‌క్రీం, చిప్స్‌ అమ్మడం దగ్గరే ఉన్నాం. ఇక్కడే మనం ఆగిపోకూడదు. డెలివరీ బాయ్స్‌/గర్ల్స్‌గానే మిగిలిపోదామా? అదే భారత్‌ లక్ష్యమా..? అది స్టార్టప్‌ల ఉద్దేశం కాదు కదా’’ అని అన్నారు.

అయితే.. భారత్‌లో స్టార్టప్‌లను తక్కువ చేయొద్దంటూ కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తడంతో కాంగ్రెస్‌ పార్టీ(Congress Party)  ఓ పోస్ట్‌ చేసింది. భారత్‌లో స్టార్టప్‌ కంపెనీలు పడుతున్న కష్టాలను పీయూష్‌ గోయల్‌ అంగీకరించారు. తద్వారా స్టార్టప్‌లపై ప్రధాని మోదీ చేస్తున్న ప్రచారం అబద్ధాలేనని మంత్రి వ్యాఖ్యలతో తేటతెల్లమైంది అని ఎక్స్‌లో ఓ పోస్ట్‌ చేసింది.

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)