Breaking News

పితృ తర్పణాలకు ప్రసిద్ధి.. ఈ ఏడు ప్రముఖ ప్రాంతాలు

Published on Sat, 09/20/2025 - 12:24

Pitru Paksha: ప్రస్తుతం దేశంలోని హిందువులు తమ పెద్దలకు తలచుకుని వారికి తర్పణాలు అందించే పితృపక్షం రోజులు కొనసాగుతున్నాయి. సెప్టెంబర్ 21న అమావాస్యతో ఇవి ముగియనున్నాయి. పితృ పక్షం చివరి రోజున చాలామంది తమ పూర్వీకులకు పిండ ప్రదానం చేస్తుంటారు. దేశం నలుమూలలా పిండ ప్రదానాలు చేసేందుకు ‍ప్రసిద్ధి చెందిన కొన్ని ప్రాంతాలు ఉన్నాయి.

ఫాల్గు నది, గయ (బీహార్)
గయ.. పిండ ప్రదానాలకు ప్రసిద్ధి చెందిన ప్రదేశంగా పరిగణిస్తుంటారు. ఇక్కడ పిండ ప్రదానాన్ని సమర్పించడం వలన పూర్వీకుల ఆత్మలకు మోక్షం లభిస్తుందని నమ్ముతారు. గయలోని ఫాల్గు నది ఒడ్డున వేలాది మంది పిండ ప్రదానాన్ని నిర్వహిస్తారు. స్కంద పురాణం, విష్ణు పురాణంలో ఈ ప్రదేశం ప్రస్తావన కనిపిస్తుంది.

బ్రహ్మకపాల్, బద్రీనాథ్ (ఉత్తరాఖండ్)
ఉత్తరాఖండ్‌లోని నాలుగు పవిత్ర స్థలాలలో ఒకటైన బద్రీనాథ్ ధామ్ సమీపంలోని బ్రహ్మకపాల్ ఘాట్.. పూర్వీకులకు  పిండ ప్రదానాన్ని అందించేందుకు ఉత్తమ ప్రదేశంగా భావిస్తారు.

సిద్ధవట్‌, ఉజ్జయిని (మధ్యప్రదేశ్)
ఉజ్జయినిలోని సిద్ధవట్‌ మందిరం పిండ ప్రదానంతో పాటు శార్ద కర్మలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. దాని కింద పిండ ప్రదానం చేయడం పూర్వీకుల ఆత్మలను సంతృప్తిపరుస్తుందంటారు. ఇక్కడి మహాకాళేశ్వర జ్యోతిర్లింగాన్ని సందర్శించడంతో పాటు సిద్ధవత్‌లో పిండ ప్రదానం చేయడం పుణ్యప్రదమని భక్తులు భావిస్తారు.

త్రయంబకేశ్వర్, నాసిక్ (మహారాష్ట్ర)
మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఉన్న త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం పితృ  కర్మలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడి గోదావరి నది ఒడ్డున పెద్దలకు తర్పణాలివ్వడం వలన వారి ఆత్మలు మోక్షాన్ని పొందుతాయని చెబుతారు.

ప్రయాగ్‌రాజ్ (ఉత్తరప్రదేశ్)
గంగా, యమున, సరస్వతి నదుల సంగమ స్థలమైన ప్రయాగ్‌రాజ్.. పూర్వీకులకు  పిండ ప్రదానాలు ఆచరించే  పవిత్ర స్థలంగా పేరొందింది. ఈ సంగమంలో పిండ ప్రదానం చేయడం వల్ల పూర్వీకుల ఆత్మలు శాంతించి, కుటుంబం బాధలు తొలగిపోతాయని పలువురు నమ్ముతారు.

రామేశ్వరం (తమిళనాడు)
రామేశ్వరం.. దక్షిణ భారతదేశంలో ఈ పవిత్ర ప్రాంతంలో పిండ ప్రదానం సమర్పించడం అనేది ఆచారంగా కొనసాగుతోంది. ఇక్కడ పిండ ప్రదానం చేయడం వలన పూర్వీకుల శాపాలు ఏవైనా ఉంటే తొలగిపోతాయని చెబుతారు.

హుగ్లీ నది ఘాట్లు (పశ్చిమ బెంగాల్)
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని హుగ్లీ నది వెంబడి ఉన్న ఘాట్‌లు పిండ ప్రదానాలకు ప్రసిద్ధి చెందినవి. పెద్ద సంఖ్యలో ప్రజలు ఇక్కడికి వచ్చి, తమ పూర్వీకులకు తర్పణాలు విడుస్తారు.

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)