Breaking News

వింత హోలీ వేడుకలు.. పురుషులు కనిపిస్తే ‘బాదుడే’!

Published on Thu, 03/21/2024 - 08:25

దేశంలో పలు పండుగలు ఒక్కో ప్రాంతంలో ఒక్కో సంప్రదాయ రీతిలో జరుగుతుంటాయి. హోలీ విషయంలోనూ ఇదేవిధంగా కనిపిస్తుంటుంది. సాధారణంగా  మహిళల కన్నా పురుషులు హోలీ వేడుకల్లో అత్యంత ఉత్సాహాన్ని కనబరచడం చూస్తుంటాం. కానీ యూపీలోని ఒక ప్రాంతంలో దీనికి భిన్నంగా జరుగుతుంటుంది. 

ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్‌లో హోలీ మర్నాడు స్త్రీలు తమ ప్రత్యేక హోలీని జరుపుకుంటారు. ఆరోజు  అక్కడ మహిళలదే రాజ్యం. పురుషులెవరూ గ్రామంలో కనిపించరు. పిలిభిత్ నగరంలోని మధోతండా ప్రాంతంలో ఈ ప్రత్యేక సంప్రదాయం కనిపిస్తుంది. హోలీ మర్నాడు  ఈ ప్రాంతంలోని మహిళలంతా గుంపులు గుంపులుగా తిరుగుతూ హోలీ వేడుకలు చేసుకుంటారు. 

ఆ రోజున స్థానిక మహిళలు హోలీ సంప్రదాయ పాటలు పాడుతూ రోడ్లపై తిరుగుతారు. పాదచారులు, వాహనదారుల నుంచి చందాలు సేకరిస్తారు. ఆ రోజున గ్రామంలోని పురుషులంతా తమ ఇళ్లలో దాక్కుంటారు. లేదా ఊరి బయట ఎక్కడైనా తలదాచుకుంటారు. పిలిభిత్ నగర చరిత్రపై పరిశోధనలు సాగిస్తున్న సీనియర్ జర్నలిస్టు డాక్టర్ అమితాబ్ అగ్నిహోత్రి మీడియాతో మాట్లాడుతూ మధోతండాలో మహిళలు జరుపుకునే హోలీకి శతాబ్దాల చరిత్ర ఉందన్నారు. 

మాధోతండా అనేది అడవి అంచున ఉన్న ప్రాంతం. పూర్వం రోజుల్లో హోలీ మరుసటి రోజున పురుషులు వేటకు వెళ్లేవారు. ఈ రోజున మహిళలు ఒకచోట చేరి హోలీ ఆడుకునేవారు. క్రమేణా ఈ హోలీ సంప్రదాయ రూపాన్ని సంతరించుకుంది. ఇప్పుడు వేటతో పాటు అడవిలోకి  వెళ్లడాన్ని నిషేధించినందున స్థానికంగా ఉన్న మగవారు ఆ రోజున గ్రామాన్ని విడిచిపెట్టి బయటకు వెళతారు. తండాలో మహిళలు హోలీ ఆడే సమయంలో వారికి పురుషులెవరైనా ఎదురైతే వారి నుండి భారీగా చందా వసూలు చేస్తారు.
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)