Breaking News

కర్ణాటక: విహారయాత్రలో విషాదం.. చిన్నారులు మృతి

Published on Wed, 10/08/2025 - 09:07

బెంగళూరు: కర్ణాటకలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. విషాద యాత్ర సందర్భంగా విషాదం నెలకొంది. విహార యాత్రకు వెళ్లిన వ్యక్తులు.. నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఇప్పటి వరకు ఏడుగురు గల్లంతు అవగా.. ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకలో మార్కోనహళ్లి ప్రాజెక్ట్‌ వద్దకు 15 మంది కలిసి విహార యాత్రకు వెళ్లారు. అనంతరం, వారిలో ఒక మహిళ, ఆరుగురు పిల్లలు కలిసి.. నీళ్లు ఉన్న ప్రాంతం వద్ద ఆడుకుంటున్న సమయంలో ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరిగింది. దీంతో, నీటిలో గల్లంతయ్యారు. వారిని కాపాడేందుకు నవాజ్‌ అనే వ్యక్తి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

పిల్లలను కాపాడే క్రమంలో నవాజ్‌ కూడా నీటిలో కొట్టుకుపోయాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, రెస్య్కూ బృందాల అక్కడి చేరుకుని వారిని కాపాడే ప్రయత్నం చేశారు. కేవలం నవాజ్‌ను మాత్రమే ప్రాణాలతో కాపాడారు. అనంతరం, ఆసుపత్రికి తరలించారు. గల్లంతైన మహిళ, పిల్లల కోసం గాలిస్తున్నారు. ఇప్పటి వరకు ఇద్దరి మృతదేహాలను బయటకు తీశారు. మిగిలిన వారి కోసం గాలింపు కొనసాగుతున్నట్టు పోలీసులు తెలిపారు. కాగా, వీరంతా కర్ణాటకలోని తుమకూరుకు చెందిన వారిగా గుర్తించారు. విహార యాత్రకు వెళ్లి తమ పిల్లలు ఇలా చనిపోవడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)