Breaking News

రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 11 మంది మృతి

Published on Wed, 08/13/2025 - 09:23

జైపూర్‌: రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఆగి ఉన్న వ్యాన్‌ను కంటైనర్‌ లారీ ఢీకొట్టిన ప్రమాదంలో 11 మంది మృత్యువాతపడ్డారు. మృతులంతా ఓ ఆలయానికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు వారి కుటుంబ సభ్యులు తెలిపారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

వివరాల ప్రకారం.. రాజస్థాన్‌లోని దౌసా-మనోహర్‌పూర్‌ రోడ్డులో ఆగి ఉన్న వ్యాన్‌ను కంటైనర్‌ లారీ ఢీకొంది. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. కొంతమంది భక్తులు ఖాఠుశ్యామ్‌ ఆలయం నుంచి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ఏడుగురు పిల్లలు, నలుగురు మహిళలు ఉన్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని మెరుగైన చికిత్స నిమిత్తం మరో ఆస్పత్రిలో చేర్పించారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మరోవైపు.. ఈప్రమాద ఘటనపై రాజస్థాన్‌ ముఖ్యమంత్రి భజన్‌లాల్‌ శర్మ స్పందించారు. ట్విట్టర్‌ వేదికగా సీఎం శర్మ.. ప్రమాద వార్త తనను దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులకు సత్వర చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇక, తమ వారిని కోల్పోయిన కారణంగా మృతుల కుటుంబ సభ్యలు కన్నీటిపర్యంతమవుతున్నారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)