Breaking News

Republic Day 2025: అందమైన ఈ శకటాలను చూసితీరాల్సిందే

Published on Thu, 01/23/2025 - 11:56

జనవరి 26న దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుగనున్నాయి. 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఈ నేపధ్యంలో ప్రతీయేటా అదేరోజున రిపబ్లిక్ డే జరుపుకుంటాం. ఈ వేడుకల నిర్వహణకు ఇప్పుటికే దేశరాజధాని ఢిల్లీలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ వేడుకల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన అందమైన శకటాలు అందరినీ అలరించనున్నాయి. ఇప్పటికే ఈ శకటాల రూపకల్పన పూర్తయ్యింది.

లడఖ్ ఘనతను చూపే ఈ శకటం ఎంతో  ప్రత్యేకంగా రూపొందింది. ఇది అత్యంత అందమైన శకటాలలో ఒకటి కానుంది. ఈ శకటాన్ని పాత్ ఆఫ్ డ్యూటీ ముందు నేషనల్ స్టేడియం క్యాంప్‌లో ప్రదర్శనకు ఉంచారు.

గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ శకటం ఎంతగానో ఆకట్టుకుంటోంది. జనవరి 26న జరిగే గణతంత్ర దినోత్సవ కవాతులో దీనిని మనం చూడవచ్చు.

2025 గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో పశ్చిమ బెంగాల్ శకటాన్ని కూడా చూడవచ్చు. ఈ అందమైన శకటం  అందరి ప్రశంసలు అందుకోనుంది.

జమ్ముకశ్మీర్ శకటం చాలా మంది హృదయాలను దోచుకోనుంది. జమ్ముకశ్మీర్ సహజ సౌందర్యానికి ప్రసిద్ధి చెందిందనే విషయం అందరికీ తెలిసిందే.

జార్ఖండ్ శకటాన్ని  ఎంతో అందంగా తయారు చేశారు. ఈ శకటం రాజ్‌పథ్‌లో పలువురి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఉత్తరప్రదేశ్ శకటం జనవరి 26న జరిగే గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో ప్రత్యేకంగా నిలవనుంది. ఈ అందమైన శకటంలో ‘సముద్ర మథనం’ప్రాణం పోసుకుంది.

బీహార్ శకటం ఆ రాష్ట్రంలోని స్వర్ణయుగాన్ని ప్రతిబింబిస్తోంది. బీహార్ అనేక శతాబ్దాలుగా ప్రపంచంలోనే అతిపెద్ద జ్ఞాన కేంద్రాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది.

పశుసంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ శకటం కూడా అందరి దృష్టిని ఆకర్షించడంలో  ముందుంటుంది. జనవరి 26న ఈ శకటాన్ని చూడవచ్చు.

2025 గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో పాల్గొనబోతున్న గోవా శకట కళాకారులు  ఎంతో ఉత్సాహంగా కనిపిస్తున్నారు.

ఇది కూడా చదవండి: ట్రంప్‌ ఆదేశాలు.. బంగ్లాదేశీయులపై ఉక్కుపాదం

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)