Breaking News

మణిపూర్‌ హింస.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన బాధిత మహిళలు

Published on Mon, 07/31/2023 - 09:37

ఇంఫాల్: మణిపూర్‌లో నగ్నంగా ఊరేగించిన ఇద్దరు మహిళలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు ఈ కేసును సుమోటోగా స్వీకరించి న్యాయబద్ధమైన, నిష్పక్షపాత ధోరణిలో విచారణ జరిపించాలని అభ్యర్ధించారు. 

మణిపూర్ అల్లర్లు మొదలైన మరుసటి రోజున ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని వలసపోతున్న ఇద్దరు మహిళలను మొదట వివస్త్రులను చేసి తర్వాత వారిపై అత్యాచారానికి పాల్పడిన సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ సంఘటన జరిగి రెండు నెలలు దాటినా కూడా వీడియో బయటకు వచ్చేంతవరకు దర్యాప్తు ప్రారంభం కాకపోవడమే అనేక అనుమానాలకు తావిస్తోంది. 

సుప్రీంకోర్టు కూడా వీడియో విషయంపై చాలా సీరియస్ అయ్యింది. ఇది పూర్తిగా రాజ్యాంగ వైఫల్యమేనని జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. మణిపూర్ సంఘటన తీవ్రంగా కలచివేసింది. ప్రభుత్వం వెంటనే స్పందించాలి. మీకు చేతకాకపోతే చెప్పండి మేమే రంగంలోకి దిగుతామని హెచ్చరించింది కూడా. రాష్ట్రంలో మహిళల భద్రత విషయమై మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని.. ఎప్పటికప్పుడు అక్కడి పురోగతి గురించి తమకు తెలపాలని కూడా సుప్రీం కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది.  

ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిపి మణిపూర్ వీడియో కేసును సీబీఐకి బదిలీ చేయాలని కోరుతూ సుప్రీం కోర్టును కోరగా ఈ రోజు అత్యున్నత న్యాయస్థానంలో దీనిపై విచారణ జరగాల్సి ఉంది. ఈ కేసులో ఇప్పటికే ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు మణిపూర్ పోలీసులు. ఇదిలా ఉండగా నగ్నంగా ఊరేగించబడిన మహిళలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పిటిషన్ దాఖలు చేయడం సంచలనంగా మారింది.  

ఇది కూడా చదవండి: కేరళలో దారుణం.. ఐదేళ్ల బాలిక రేప్, హత్య..

Videos

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

22 మున్సిపాలిటీల్లో ఎన్నికలు వాయిదా...?

ఎవరికీ ఏం జరిగిన నాదే బాధ్యత.. దాడి తర్వాత అత్యవసర సమావేశం

పోలీసులకెందుకంత భయం? ఎన్నికల్లో పోటీ చేయనివ్వరా? విశ్వేశ్వర్ రెడ్డి ఫైర్

గడువు పెరుగుతుందా..? నామినేషన్లపై సుప్రీం ఏం చెప్పనుంది..?

టీడీపీ దౌర్జన్యకాండ.. YSRCP అభ్యర్థుల నామినేషన్లు అడ్డుకోవాలని పిలుపు..

నా ఫ్యామిలీని కాపాడండి.. YSRCP అభ్యర్థి షేక్ ఇమామ్ విజ్ఞప్తి

నీకు దమ్ముంటే.. రా, లోకేశ్‌కు వైసీపీ దాసరి అరుణ బహిరంగ సవాల్!

Photos

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)