Breaking News

నవ్వు నాలుగు విధాలు : మీ పర్సనాలిటీని చెప్పేస్తుంది

Published on Sat, 11/29/2025 - 08:20

మన భావాలను వ్యక్తం చేసే విధానం, ముఖ్యంగా ప్రతి ఒక్కరు ఒక్కోలా నవ్వడం కూడా మన స్వభావం, భవిష్యత్తు గురించి చాలా చెబుతుంది. మీరు ఏ విధంగా నవ్వుతారు? ఆ నవ్వును బట్టి మన స్వభావం, ఇతర లక్షణాలు ఎలా ఉంటాయో మనస్తత్వవేత్తలు చెప్పిన విషయాలు.. సరదాగా..  

ముఖంలో చిరునవ్వుతో ఉండేవారుఎప్పుడూ నవ్వుతూ, ముఖంలో చిన్న చిరునవ్వుతో ఉండే చాలా మందిని మీరు చూసి ఉంటారు. ఇలా ఎప్పుడూ నవ్వు ముఖంతో ఉండేవారు జీవితంలో చాలా పురోగతి సాధిస్తారు. వారు ఎప్పుడూ దేనిలోనూ లోటును అనుభవించరు. అదే సమయంలో వారు తమ కషితో ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తారు. మంచి జీవితాన్ని గడుపుతారు.

పళ్లు కనిపించకుండా నవ్వేవారు
నవ్వినప్పుడు దంతాలు కనిపించని వ్యక్తులను చాలా మంచివారుగా భావిస్తారు. అలాంటి వ్యక్తులు మంచి వ్యక్తిత్వం కలిగి ఉంటారు. వారి స్వభావం చాలా సరళంగా ఉంటుంది. ఈ వ్యక్తులు నమ్మదగినవారుగా ఉంటారు. ఎవరి నమ్మకాన్ని వమ్ము చేయరు. ఎల్లప్పుడూ వారికి అండగా నిలుస్తారు. దంతాలు కనిపించకుండా నవ్వే వ్యక్తులు చాలా అదృష్టవంతులుగా కూడా పరిగణించబడతారు.

నవ్వేటప్పుడు కళ్లు మూసుకునేవారు
కళ్ళు మూసుకుని నవ్వే వ్యక్తి తన భావాలను ఎవరి ముందు బహిరంగంగా వ్యక్తపరచరని నమ్ముతారు. వీరు తమ మనస్సులో చాలా విషయాలను దాచుకుంటారు. సమస్య తలెత్తినా వారు విషయాన్ని లోపలే ఉంచుకుని సమస్యను ఒంటరిగా ఎదుర్కొంటారు. ఈ వ్యక్తులు తమదైన రీతిలో జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు.

నోరు తెరిచి నవ్వేవారు
నవ్వినప్పుడు దంతాలు కన్పించకుండా నోరు కొద్దిగా తెరిచి నవ్వే వారిని చాలా అదృష్టవంతులుగా భావిస్తారు. అలాంటి వారు తమ ఆనందాన్ని స్వేచ్ఛగా వ్యక్తం చేస్తారు. అదే సమయంలో వారు శాంతిని ఇష్టపడతారు. ఏ పరిస్థితిలోనైనా ఓపికగా ఉంటారు. అందుకే వారు క్లిష్ట పరిస్థితుల నుండి సులభంగా బయటపడతారు. జీవితంలో చాలా పురోగతి సాధిస్తారు.

ఇదీ చదవండి: పాతికేళ్లకే యంగెస్ట్‌ బిలియనీర్‌.. అమన్‌ అంటే అమేయ ప్రతిభ

బిగ్గరగా నవ్వే వారు
మీరు చాలా మంది బిగ్గరగా నవ్వడం చూసి ఉంటారు. బిగ్గరగా నవ్వే వారు ప్రపంచం గురించి పట్టించుకోరు. స్వేచ్ఛగా జీవించడానికి ఇష్టపడతారు. ఇతరులు వారిని అహంకారంగా భావించినప్పటికీ, వారు జీవితాన్ని ఉత్సాహంగా గడపడానికి ఇష్టపడతారు.అంతేకాదు, చాలా తెలివైనవారు, అందువల్ల, తమ పనిని చాలా సులభంగా పూర్తి చేస్తారు. అయితే బిగ్గరగా నవ్వే వారు జీవితంలో కష్టాలను, అడ్డంకులను ఎదుర్కోవలసి ఉంటుందని పెద్దలు చెబుతారు.

ఇదీ చదవండి: రూ. 300తో ఇంటినుంచి పారిపోయి...ఇపుడు రూ. 300 కోట్లు

Videos

రెండు కాళ్లు లేని దివ్యాంగుడిపై దాడి.. టీడీపీ నేతల దాష్టీకం

కివీస్ తో పోరుకు బుల్డోడు అసలు కారణం ఇదే

నీ బెదిరింపులకు ఎవరూ భయపడరు దీప్తి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఐదు రౌండ్ల కాల్పులు.. టైగర్ ష్రాఫ్ కేసులో కీలక మలుపు..!

నాకు అంత కోపం రావడానికి కారణం.. నామినేషన్ వేసేటప్పుడు అసలు ఏం జరిగిందంటే

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)