Breaking News

టమాటాల వ్యాను బోల్తా.. ఎగబడ్డ జనం

Published on Mon, 08/07/2023 - 05:57

హజారీబాగ్‌: టమాటాల లోడుతో వస్తున్న వ్యాను బోల్తా పడగా అందులోని టమాటాల కోసం జనం ఎగబడ్డారు. పోలీసులు రంగప్రవేశం చేసి కొంత సరుకును మాత్రం తిరిగి స్వా«దీనం చేసుకోగలిగారు. ఈ ఘటన బిహార్‌లో జరిగింది. నేపాల్‌ నుంచి టమాటాల లోడుతో వస్తున్న వ్యాను ఆదివారం ఉదయం 5 గంటల సమయంలో బిహార్‌లోని రాంచీ–పట్నా హైవేపై చర్హి వ్యాలీ వద్ద పల్టీ కొట్టింది. డ్రైవర్‌ అకస్మాత్తుగా బ్రేక్‌ వేయడంతో వ్యాను బోల్తా పడి అందులోని టమాటాలు రోడ్డుపై పడిపోయాయి.

ఇంకేముంది..? టమాటాల ధర కిలో వందల్లో ఉన్న వేళ..ఈ ఘటన సమీప గ్రామస్తులకు అనుకోని వరంలా మారింది. వెంటనే అక్కడికి పరుగెత్తుకొచ్చారు. సంచులు, డబ్బాలతో టమాటాలు ఎత్తుకుపోవడం మొదలుపెట్టారు. వ్యాను డ్రైవర్, క్లీనర్‌ అడ్డుకున్నా వారు లెక్కచేయలేదు. అయితే, ఈ గందరగోళంతో ట్రాఫిక్‌ భారీగా నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని జనాన్ని చెదరగొట్టి ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు. గ్రామస్తులు ఎత్తుకెళ్లిన టమాటాల్లో చాలా వరకు తిరిగి రాబట్టారు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)