Breaking News

Karnataka: గణపతి నిమజ్జనంలో ఉద్రిక్తత

Published on Thu, 09/12/2024 - 08:44

మాండ్య: కర్ణాటకలోని మాండ్యలో గణేష్ నిమజ్జనం సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. రాళ్లు రువ్వడం, విధ్వంసం సృష్టించడం వంటి ఘటనలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటనల్లో పలు దుకాణాలు, వాహనాలు దగ్ధమయ్యాయి. ఈ ఘర్షణలు మైసూరు రోడ్డులోని దర్గా సమీపంలో చోటుచేసుకున్నాయి. ఈ ఉదంతంలో పోలీసులు 46 మందిని అదుపులోకి తీసుకున్నారు. 

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు లాఠీచార్జి చేశారు. నాగమంగళ పట్టణంలో గణేష్ విగ్రహ నిమజ్జనం కోసం బద్రికొప్పలు గ్రామానికి చెందిన కొందరు యువకులు ఊరేగింపు నిర్వహిస్తుండగా, రెండు వర్గాల యువకుల మధ్య వాగ్వాదం జరిగింది. తరువాత ఊరేగింపుపై కొందరు దుండగులు రాళ్లు రువ్వారు. గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు స్వల్పంగా లాఠీచార్జి చేయాల్సి వచ్చింది.

రాళ్లదాడిలో కొందరు గాయపడ్డారని, పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చిందని సమాచారం. ముందుజాగ్రత్త చర్యగా పోలీసులు ఈ ప్రాంతంలో సీఆర్‌పీసీ 144 కింద  నిషేధాజ్ఞలు విధించారు. అల్లర్లుకు పాల్పడిన 46 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటకలోని మాండ్యా కంటే ముందు గుజరాత్‌లోని సూరత్‌లోనూ ఇలాంటి దృశ్యమే కనిపించింది. అల్లరి మూకలు గణపతి మండపంపై రాళ్లు రువ్వారు. దీంతో ఆ ప్రాంతంలో హింస చెలరేగింది. ఈ ఉదంతంలో 28 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

 

ఇది కూడా చదవండి: గణేష్‌ లడ్డూ చోరీ 

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)