Breaking News

పెళ్లిలో గొడవ.. వరుణ్ణి కిడ్నాప్‌ చేసిన డ్యాన్సర్లు

Published on Sun, 05/25/2025 - 09:47

పట్నా: అక్కడ అంగరంగ వైభవంగా వివాహం జరుగుతోంది. అతిథులంతా ఉత్సాహంగా ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. ఈ ఉత్సాహాన్ని రెండింతలు చేసేందుకు డ్యాన్సర్లను పిలిపించారు. అంతా సవ్యంగా సాగుతుండగా ఊహించని పరిణామం చోటుచేసుకుంది. డ్యాన్సర్లంతా కలిసి వరుణ్ణి కిడ్నాప్‌ చేశారు. అతిథులంతా అవాక్కయ్యారు.          

బీహార్‌(Bihar)లోని గోపాల్‌గంజ్ జిల్లాలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. ఈ ఘటన శనివారం రాత్రి రెండు గంటల సమయంలో జరిగింది. సాధు చౌక్ మొహల్లాలో  పెళ్లిలో వినోదం కోసం పిలిచిన డాన్స్‌ టీమ్‌ వరుణ్ణి కిడ్నాప్‌ చేసింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు అందింది. బైకుంఠపూర్ పరిధిలోని దిఘ్వా దుబౌలీలో సురేంద్ర శర్మ కుమార్తె వివాహం జరుగుతోంది. వేడుకలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ఊరేగింపుగా వస్తున్న మగపెళ్లివారిని ఆహ్వానించేందుకు డాన్స్‌ బృందాన్ని పిలిపించారు. అయితే వీరికి స్థానికులతో ఏదో విషయమై గొడవ జరిగింది. చివరికి అది హింసాత్మకంగా మారింది. సదరు డ్యాన్స్‌ బృందం ఆగ్రహంతో వధువు ఇంటిలోనికి చొరబడి, అక్కడ ఉన్న వారిపై దాడి చేసింది. ఈ నేపధ్యంలో వధువు, ఆమె తల్లి విద్యావతి దేవితో సహా పలువురు మహిళలు గాయపడ్డారు.  

అంతటితో ఊరుకోకుండా వారు వధువు ఇంటిలోని ఆభరణాలు, విలువైన వస్తువులు, ఖరీదైన దుస్తులను దోచుకుని ఉడాయించారు. విషయం తెలుసుకున్న వరుడు డ్యాన్స్‌ బృంద సభ్యులను అడ్డుకునే ప్రయత్నం చేశాడు. అయితే వారు అతన్ని చావబాది, బలవంతంగా వ్యాన్‌లోనికి ఎక్కించుకుని, తమతో పాటు తీసుకుపోయారు. సమాచారం అందిన వెంటనే స్థానిక పోలీసులు(Local police) సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరారైన నిందితుల కోసం గాలిస్తున్నారు.  విషయం తెలుసుకున్న వధువు షాక్‌లో ఉంది. ప్రస్తుతం ఆమెకు వైద్య చికిత్స అందిస్తున్నారు.

ఇది కూడా చదవండి: ప్రభుత్వం కోసం పని చేయను: శశి థరూర్

#

Tags : 1

Videos

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)