Breaking News

ఫ‍్లైట్‌లో ప్రయాణికుడి వీరంగం.. బాత్‌రూం డోర్ పగులగొట్టి..

Published on Wed, 07/12/2023 - 21:30

ఢిల్లీ: ఎయిరిండియా విమానంలో ఓ ప్రయాణికుడు వీరంగం సృష్టించాడు. విమానంలో సిబ్బందితోపాటు తోటి ప్రయాణికులపై దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత విమానం టాయిలెట్‌ తలుపునూ పగులగొట్టాడు. టొరంటో నుంచి ఢిల్లీ వస్తోన్న విమానంలో ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. దీంతో ఆ ప్రయాణికునిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

నేపాల్‌కు చెందిన మహేశ్‌ సింగ్‌ పండిత్‌ అనే ప్రయాణికుడు కెనడా నుంచి ఇండియా‌కు ఎయిరిండియా విమానంలో బయలుదేరాడు. విమానం టేకాఫ్‌ అయిన కొద్ది సేపటికే తనకు కేటాయించిన సీటులో కాకుండా పక్క సీటులో కూర్చున్నాడు. ఆ తర్వాత టాయిలెట్‌లో ధూమపానం చేయడంతోపాటు ఆ తలుపును పగలగొట్టాడు. అడ్డుపడిన సిబ్బందితోపాటు తోటి ప్రయాణికులపై ఎదురుదాడి చేశాడని విమానంలోని సిబ్బంది తెలిపారు.

చాలా గొడవ చేసిన తర్వాత  ఎట్టకేలకు ప్రయాణికులతో కలిసి నిందితున్ని సీట్లో కూర్చోబెట్టామని విమాన సిబ్బంది తెలిపారు. విమానం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అతన‍్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఇటీవల విమానాల్లో ప్రయాణికులు ఇబ్బందికరంగా ప్రవర్తిస్తూ తోటివారికి అసౌకర్యం కలిగిస్తున్నారు. ముంబయిలోనూ విమానంలో ఇలాంటి ఘటనే ఇటీవల వెలుగులోకి వచ్చింది. 

ఇదీ చదవండి: సీబీఐ స్కెచ్‌.. వలలో చిక్కిన హెడ్‌ కానిస్టేబుల్.. వీడియో వైరల్‌..

Videos

AP: ఇద్దరి IPS ల సస్పెన్షన్ ఎత్తివేత

కొండా సురేఖపై వేటు..

గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో కేతిరెడ్డి

రాజీనామానా..? బర్తరఫ్ నా..? క్లైమాక్స్ కు కొండా సురేఖ ఎపిసోడ్

లక్ష్మణ్ తో BCCI కీలక మీటింగ్ టెన్షన్ లో గంభీర్, అగార్కర్

LIC కొత్త పాలసీ.. బెనిఫిట్స్ తెలిస్తే ఎగిరి గంతేస్తారు

KA పాల్ బంపర్ ఆఫర్

Kurnool: SV మోహన్ రెడ్డి తనయుడి రిసెప్షన్ కు హాజరైన YS జగన్

ఎవరివైపు పబ్లిక్? చాణక్య సర్వేలో క్లారిటీ!

ధనుష్ పార్టీకిలోకి TVK మంత్రి..?

Photos

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)