Breaking News

రేపటి నుంచి పార్లమెంట్‌ సమావేశాలు.. స్పీకర్‌ ఆయనేనా?

Published on Sun, 06/23/2024 - 12:32

సాక్షి, ఢిల్లీ: రేపు(సోమవారం) నుంచి 18వ పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. సోమవారం ఉదయం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. భర్త​ృహరి మెహతాజ్‌ను ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణం చేయించనున్నారు. ఇక, జూన్‌ 26వ తేదీన లోక్‌సభ స్పీకర్‌ ఎన్నికల జరుగనుంది.

కాగా, ప్రొటెం స్పీకర్‌గా ఎంపికైన మెహతాజ్‌.. రేపు, ఎల్లుండి కొత్త ఎన్నికైన లోక్‌సభ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేపించనున్నారు. తొలిరోజు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, ఏపీ మంత్రులు సహా 280 మంది ఎంపీలతో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. రెండో రోజు తెలంగాణ సహా మిగిలిన ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తారు.

ఇక, జూన్ 26న లోకసభ స్పీకర్ ఎన్నిక ఉంటుంది. మరోవైపు.. ఏకాభిప్రాయంతో స్పీకర్ ఎన్నికకు ప్రయత్నం చేస్తోంది ఎన్డీయే ప్రభుత్వం. ఓం బిర్లాకే మళ్లీ స్పీకర్‌ పదవి ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మరోవైపు.. డిప్యూటీ స్పీకర్‌ పదవి తమకు ఇవ్వాలని విపక్ష కూటమి కోరుతున్నట్టు తెలుస్తోంది.

సంప్రదాయంగా ప్రతిపక్షానికి, లేదంటే మిత్రపక్షాలకు డిప్యూటి స్పీకర్ పదవి ఇస్తారు. 2014లో అన్నాడీఎంకేకు డిప్యూటీ స్పీకర్ పదవిని బీజేపీ ఇచ్చింది. 16వ లోక్‌సభలో తంబిదొరై డిప్యూటీ స్పీకర్‌గా ఉన్నారు. ఇక, 17వ లోక్‌సభ(2019)లో మాత్రం డిప్యూటీ స్పీకర్‌ పదవి ఎవరికీ ఇవ్వకపోవడంతో ఖాళీగానే ఉంది.  ఇదిలా ఉండగా.. జూన్‌ 27వ తేదీన ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం చేయనున్నారు. 

Videos

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)