Breaking News

పార్లమెంట్‌లో వాయిదాల పర్వం

Published on Sat, 08/05/2023 - 05:39

న్యూఢిల్లీ: మణిపూర్‌ అంశంపై పార్లమెంట్‌లో యథావిధిగా రగడ కొనసాగింది. మణిపూర్‌ హింసాకాండపై పార్లమెంట్‌లో వెంటనే చర్చ ప్రారంభించాలని, ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేస్తూ ప్రతిపక్ష సభ్యులు లోక్‌సభలో శుక్రవారం ఆందోళనకు దిగారు. నినాదాలతో హోరెత్తించారు. సభా కార్యకలాపాలకు పదేపదే అడ్డు తగిలారు. రాజస్తాన్‌లో మహిళలపై జరుగుతున్న నేరాలపై చర్చ జరపాలంటూ రాజ్యసభలో అధికార బీజేపీ సభ్యులు నినదించారు. గందరగోళం కారణంగా లోక్‌సభ, రాజ్యసభను పలుమార్లు వాయిదా వేయాల్సి వచి్చంది. చివరకు రెండు సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి.  

లోక్‌సభలో పట్టువీడని విపక్షాలు  
లోక్‌సభ శుక్రవారం ఉదయం ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చారు. మణిపూర్‌ అంశంపై ప్రధానమంత్రి ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు. ఇంతలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషీ జోక్యం చేసుకున్నారు. ముఖ్యమైన బిల్లులను సభలో ప్రవేశపెట్టాల్సి ఉందని, సభ్యులంతా సహకరించాలని కోరారు. సభా కార్యకలాపాల్లో పాల్గొనాలని కోరారు. అయినప్పటికీ ప్రతిపక్ష ఎంపీలు పట్టించుకోలేదు. నినాదాలు కొనసాగించారు. ప్రతిపక్షాల ఆందోళన మధ్య దాదాపు 20 నిమిషాలపాటు సభ జరిగింది.

అనంతరం సభను స్పీకర్‌ మధ్యాహ్నం 12 గంటల దాకా వాయిదా వేశారు.  ఆ తర్వాత సభ ప్రారంభమయ్యాక కూడా విపక్షాలు శాంతించలేదు. దాంతో చేసేదిలేక సభను స్పీకర్‌ సోమవారానికి వాయిదా వేశారు.   సైనిక దళాలను మరింత బలోపేతం చేయడానికి ఉద్దేశించిన ‘ఇంటర్‌–సరీ్వసెస్‌ ఆర్గనైజేషన్స్‌(కమాండ్, కంట్రోల్, డిసిప్లిన్‌) బిల్లు’ను రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. స్వల్ప చర్చ అనంతరం సభలో ఈ బిల్లు ఆమోదం పొందింది. అలాగే ‘ఇండియన్‌ ఇనిస్టిట్యూట్స్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌(అమెండ్‌మెంట్‌) బిల్లు–2023’ కూడా ఆమోదించారు.  

జ్యసభలో అధికార బీజేపీ ఆందోళన    
రాజస్తాన్‌లోని భిల్వారా జిల్లాలో 14 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య వ్యవహారాన్ని రాజ్యసభలో అధికార బీజేపీ సభ్యులు లేవనెత్తారు. కాంగ్రెస్‌ పార్టీ పాలిత రాజస్తాన్‌లో శాంతి భద్రతలు నానాటికీ దిగజారుతున్నాయని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ ఆరోపించారు. బీజేపీ సభ్యులు ఆయనకు మద్దతు పలికారు. దీంతో ప్రతిపక్ష ఎంపీలు ‘మణిపూర్, మణిపూర్‌’ అంటూ నినాదాలు చేశారు.  దీంతో చైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ సభను మధ్యాహ్నం 12 గంటల వరకూ వాయిదా వేశారు. ఆ తర్వాత కూడా ప్రతిష్టంభనకు తెరపడలేదు. దీంతో సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు చైర్మన్‌ ధన్‌ఖడ్‌ ప్రకటించారు.  

Videos

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)