Breaking News

పార్లమెంట్‌లో మణిపూర్‌ మంటలు.. లోక్‌సభ రేపటికి వాయిదా

Published on Mon, 07/24/2023 - 11:02

Updates..

► మణిపూర్ అంశంపై ప్రతిపక్షాల ఆందోళనలతో లోక్‌ సభ మరోసారి దద్దరిల్లింది. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ప్రసంగాన్ని విపక్ష సభ్యులు అడ్డుకున్నారు. విపక్షాల ఆందోళనల నడుమ లోక్‌సభ రేపటికి వాయిదా పడింది.

► మణిపూర్ అంశంపై తప్పుకుండా చర్చిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. లోక్‌సభలో మణిపూర్ అంశంపై చర్చను జరగనీయాలని ప్రతిపక్షాలను కోరారు. ఈ సున్నితమైన అంశానికి సంబంధించిన వివరాలను దేశ ప్రజలు తెలుసుకోవాలని అమిత్ షా చెప్పారు. 

►  మణిపూర్‌ అంశంపై రాజ్యసభలో గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో ఆప్‌ ఎంపీ సంజయ్‌ సింగ్‌.. రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్‌ ధన్కర్‌ వెల్‌లోకి దూసి ఆయనపైకి ఫ్లకార్డ్‌లతో నిరసనలు తెలిపారు.  విపక్షాల ఆందోళనల నడుమ లోక్‌సభ రేపటికి వాయిదా పడింది.

►  ఈ క్రమంలో ధన్కర్‌.. సంజయ్‌ సింగ్‌ను సభ నుంచి సస్పెండ్‌ చేశారు. వర్షాకాల సమావేశాల నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్టు ధన్కర్‌ స్పష్టం చేశారు. 

► మళ్లీ ఉభయ సభలు ప్రారంభమైన వెంటనే ప్రతిపక్షాలు గందరగోళం సృష్టించడంతో రెండు సభలు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడ్డాయి. 

► లోక్‌సభ సైతం మధ్యాహ్నం 12 గంటల వరకూ వాయిదా పడింది. 

► మధ్యాహ్నం 12 గంటలకు రాజ్యసభ వాయిదా.

► లోక్‌సభలో ప్రతిపక్ష పార్టీల ఎంపీల నిరసనలు.. 


► లోక్‌సభలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మాట్లాడుతూ.. మణిపూర్‌కు చర్చకు మేము సిద్ధంగా ఉన్నామన్నారు. 

► కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. మణిపూర్‌ అంశంపై చర్చించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. 140 కోట్ల మంది ప్రజల నాయకుడు(ప్రధాని మోదీ) పార్లమెంటు వెలుపల ప్రకటన చేశారు. అలాగే, ప్రజాప్రతినిధులు కూర్చునే పార్లమెంటులో కూడా ప్రకటన చేయాలి అని డిమాండ్‌ చేశారు. 

► టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ మాట్లాడుతూ.. మణిపూర్‌ దారుణ ఘటనలో సోషల్‌ మీడియాలో మేము చూసిన విజువల్స్ చాలా కలవరపెడుతున్నాయి. మణిపూర్‌పై సభలో చర్చను ప్రధాని మోదీ కోరుకోవడం లేదు. ప్రభుత్వం దృష్టిని మళ్లిస్తోంది. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అసమర్థమైనది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

► ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే పార్లమెంట్‌ వద్ద మీడియాతో మాట్లాడుతూ.. మణిపూర్‌ ఘటన మహిళలకు సంబంధించిన విషయం. ఇదేమీ రాష్ట్రాల మధ్య పోటీ కాదు. ఇలాంటి ఘటనలు ఏ రాష్ట్రంలో జరిగినా అది తప్పే అవుతుందన్నారు. 

► పార్లమెంట్‌ సమావేశాలకు హాజరైన కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ. 

ఢిల్లీ: పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో మరోసారి మణిపూర్‌ ఘటనపై నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రతిపక్ష నేతలు మణిపూర్‌పై ప్రధాని మోదీ ఉభయ సభల్లో మాట్లాడాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

► ఇటు, అధికార బీజేపీ పార్లమెంట్‌ సభ్యులు.. పలు రాష్ట్రాలకు మహిళలపై జరుగుతున్న దాడులపై ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నారు. 

► రాజస్థాన్‌కు చెందిన ఎంపీలు పార్లమెంట్‌లోని గాంధీ విగ్రహం వద్ద నిరసనకు దిగారు. వీరంతా రాజస్థాన్‌లో జరుగుతున్న క్రైమ్స్‌, మహిళలపై దాడులను ఖండిస్తూ నిరసనలు తెలిపారు. సీఎం అశోక్‌ గెహ్లాట్‌ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

► ఆప్‌ ఎంపీ రాఘవ్‌ చద్దా మీడియాతో మాట్లాడుతూ.. మణిపూర్‌ అంశంపై ప్రధాని మోదీ సభల్లో మాట్లాడాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారు. మణిపూర్‌ శాంతి నెలకోల్పాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది. మణిపూర్‌ విషయంలో కేంద్రం తీరుకు మేము ఈరోజు నిరసనలు తెలుపుతాము. రాజ్యసభ ఛైర్మన్‌ చర్చకు అనుమతించాలని కోరారు. 

► ‘ఇండియా’.. ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు పార్లమెంట్‌ వద్ద నిరసనకు దిగారు. మణిపూర్‌ అంశంపై ఉభయ సభల్లో ప్రధాని చర్చకు రావాలని డిమాండ్‌ చేశారు. 


► కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ.. పార్లమెంట్‌లో నిర్మాణాత్మక చర్చల్లో పాల్గొనాలని ప్రతిపక్షాలను అభ్యర్థిస్తున్నాం. చర్చల నుంచి ఎందుకు పారిపోతున్నారు? వారి వ్యూహాన్ని ఎవరూ అర్థం చేసుకోలేరు అని అన్నారు. 


 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)