రాజ్యసభలో వందేమాతరం బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రం

Published on Fri, 07/24/2026 - 11:12

సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ఐదో రోజు అదే సీన్‌ రిపీట్‌ అయ్యింది. నీట్‌పై చర్చకు సిద్ధమని కేంద్రం చెబుతున్నా.. ముందు మంత్రి రాజీనామా చేశాకే చర్చ చేపట్టాలని విపక్షాలు ఆందోళనకు దిగాయి. దీంతో.. ఓసారి వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన లోక్‌సభను స్పీకర్‌ ఓంబిర్లా సోమవారానికి వాయిదా వేశారు. 

అంతకు ముందు.. కార్గిల్‌ అమర వీరులకు నివాళులర్పించిన అనంతరం లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాను సభను ప్రారంభించారు. అయితే ఆ కాసేపటికే విపక్షాల నినాదాలతో సభ మారుమోగింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా తర్వాతే నీట్‌ లీక్‌ వ్యవహారంపై చర్చ జరగాలని విపక్ష సభ్యులు నినాదాలు చేశారు. అయితే ప్రభుత్వం ఆందోళనకారులతో చర్చలకు సిద్ధమైందని.. ఈ తరుణంలో సభ కార్యాకలాపాలకు ఆటంకం సరికాదని కేంద్రం తరఫున ప్రకటన వెలువడింది. ఈ తరుణంలో విపక్షాల శాంతిచకపోవడంతో స్పీకర్‌ సభను మధ్యాహ్నం 12గం. దాకా వాయిదా వేశారు. 

అయితే తిరిగి ప్రారంభమయ్యాక కూడా పరిస్థితిలో మార్పు రాలేదు. లోక్‌సభలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు మాట్లాడుతూ.. నీట్‌ అంశంపై చర్చ జరగాలని ప్రభుత్వం కోరుకుంటోందని తెలిపారు. విపక్ష నేత కే.సీ. వేణుగోపాల్‌తో మరోసారి చర్చించానని చెప్పారు. ప్రధాని మోదీ కూడా దేశానికి హామీ ఇచ్చారని, సోనమ్‌ వాంగ్‌చుక్‌ సైతం నిరాహార దీక్ష విరమించి చర్చ జరపాలని కోరారని రిజిజు పేర్కొన్నారు. నీట్‌పై చర్చకు అవకాశం ఇవ్వకపోతే అది దేశానికి సరైన సంకేతం ఇవ్వదని అన్నారు. అయినా విపక్షాలు శాంతించకపోవడంతో.. స్పీకర్‌ సభను సోమవారానికి వాయిదా వేశారు. 

ఇక.. రాజ్యసభలో మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపించింది. సభ కాసేపు సాగినట్లే కనిపించినా.. ఆ వెంటనే విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ రాజీనామాకు డిమాండ్‌ చేయడం, విద్యార్థులకు ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలని నినాదాలు చేశారు. దీంతో చైర్మన్‌ రాధాకృష్ణన్‌ సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. 

రాజ్యసభ ముందుకు వందేమాతరం బిల్లు
స్వాతంత్ర్య సమర కాలం నుంచి జాతీయ భావోద్వేగాలకు ప్రతీకగా నిలిచిన ‘వందేమాతరం’ గీతానికి మరింత గుర్తింపు కల్పించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టింది. వందేమాతర గీతాన్ని అవమానిస్తే మూడేళ్ల జైలు శిక్ష విధించేలా చట్టం తీసుకొచ్చింది. విపక్షాల ఆందోళనలతో రాజ్యసభ సోమవారానికి వాయిదా పడింది.

అంతకు ముందు.. పార్లమెంట్‌ ఆవరణలో విపక్ష సభ్యులు నిరసన చేపట్టారు. అర్ధరాత్రి ప్రధాని మోదీ వీడియో సందేశం ఎందుకని?.. ప్రకటన చేయాలనుకుంటే సభలో చేయాలని.. పార్లమెంట్‌లో మాట్లాడితే తాము సంతోషిస్తామని.. ఆ చర్చలో తాము పాల్గొంటామని రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే అన్నారు. నీట్‌ లీకును తీవ్ర నేరంగా చూస్తున్నామని.. నిందితులను వదిలే ప్రసక్తే లేదని కేంద్రం అంటోంది. పేపర్‌లీక్‌లపై ఉక్కుపాదం మోపుతామని.. ఇందుకోసం కఠిన చట్టాలు తెస్తామని.. సోమవారం ఆ బిల్లును ప్రవేశపెడతామని స్వయంగా ప్రధాని మోదీ ప్రకటించారు. అయితే అటు నిరసనకారులు, ఇటు ప్రతిపక్షాలు మాత్రం మంత్రి రాజీనామా తర్వాత ఏదైనా అని పట్టుబడుతున్నాయి.

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)