Breaking News

‘నేను అరెస్టయితే పదవికి రాజీనామా చేశా’..ప్రతులు చించి హోంమంత్రిపై విసిరేసి

Published on Wed, 08/20/2025 - 14:26

సాక్షి న్యూఢిల్లీ: పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో భాగంగా లోక్‌సభలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా లోక్‌సభలో 130వ రాజ్యాంగ సవరణ బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాల సవరణ బిల్లు, జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ సవరణ ఈ మూడు కీలక బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అనంతరం, ఆ బిల్లులను జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాల ఆందోళనలతో లోక్‌సభ అట్టుడికి పోయింది. 

30 రోజుల పాటు జైలు శిక్షను అనుభవించిన నేతల పదవులు రద్దయ్యేలా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రవేశపెట్టిన బిల్లుపై ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. ఈ బిల్లుతో రాజకీయ దుర్వినియోగం జరిగే ప్రమాదం ఉందంటూ బిల్లు ప్రతుల్ని చించివేస్తూ ప్రతిపక్ష ఎంపీలు ఆందోళన చేశారు. దీంతో స్పీకర్‌ సభను మధ్యాహ్నం 3గంటల వరకు వాయిదా వేశారు.

వాయిదాకి ముందు తీవ్రమైన క్రిమినల్ కేసుల్లో అరెస్టయి జైలుకు వెళ్లే ప్రజాప్రతినిధుల పదవులకు చెక్ పెట్టేలా హోమంత్రి అమిత్‌షా బిల్లును ప్రవేశ పెట్టారు. ఆ సమయంలో ప్రతిపక్ష ఎంపీలు బిల్లు ప్రతుల్ని చించి అమిత్‌షాపై విసిరేశారు. ఈ బిల్లు దేశ సమాఖ్య విధానానికి పూర్తి విరుద్దం అంటూ నినాదాలు చేశారు. గుజరాత్‌ హోమంత్రిగా ఉన్నప్పుడు అమిత్‌షా అరెస్ట్‌ అయ్యారంటూ ప్రతిపక్ష ఎంపీలు చేసిన ఆరోపల్ని అమిత్‌షా ఖండించారు.

‘అవును ..నన్ను తప్పుడు ఆరోపణలతో అరెస్ట్‌ చేశారు. నేను అరెస్ట్‌ అయినప్పుడు  చేసినా నైతికంగా పదవికి రాజీనామా చేశాను’ అంటూ ప్రతిపక్ష ఎంపీలను అమిత్‌షా వారించారు. 

లోక్‌సభలో కీలక బిల్లులు ప్రవేశపెట్టిన కేంద్రమంత్రి అమిత్ షా

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)