Breaking News

‘టపాసుల పొగతో వ్యాధులు నయం’ బీజేపీ ఎమ్మెల్యే వింత వ్యాఖ్యలు!

Published on Mon, 11/09/2026 - 09:02

కోల్‌కతా: దీపావళి, కాళీపూజ వేళ బాణసంచా కాల్చడంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న తరుణంలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే పాపియా అధికారి వింత వ్యాఖ్యలు చేశారు. టపాసులు కాల్చడం వల్ల పలు వ్యాధులు నయమవుతాయని ఆమె పేర్కొన్నారు. కోల్‌కతాలోని టోలీగంజ్ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన పాపియా అధికారి.. తన నియోజకవర్గంలో నిర్వహించిన కాళీపూజ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా మైక్ పట్టుకుని ప్రసంగిస్తుండగా ఆమె ముందే భారీ శబ్దంతో బాణసంచా పేలింది. అయినప్పటికీ తన ప్రసంగాన్ని కొనసాగించిన ఆమె.. బాణసంచా కాల్చడం వల్ల అనేక వ్యాధులు నయమవుతాయని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి సువేందు అధికారి కూడా టపాసులు కాల్చేందుకు అనుమతించినట్లు ఆమె పేర్కొన్నారు. బాణసంచా లేకుండా కాళీపూజ ఎలా పూర్తవుతుందని ప్రశ్నించారు. అయితే పోలీసులు తెలిపిన మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, గతంలో పలు కాళీపూజ మండపాల ప్రారంభోత్సవాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి సువేందు అధికారి.. పండుగల సందర్భంగా గ్రీన్ క్రాకర్స్ మాత్రమే వినియోగించాలని, శబ్ద కాలుష్య నిబంధనలు పాటించాలని ప్రజలకు సూచించారు.

ఇదీ చదవండి: దీపావళి వేళ.. వందేభారత్‌పై రాళ్ల దాడి!

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)