Breaking News

అప్పడం ఘన చరిత్ర: పాక్‌లో పుట్టి, విభజన సమయంలో ఉపాధిగా మారి..

Published on Mon, 08/21/2023 - 12:50

మనదేశం రుచికరమైన ఆహారం విషయంలో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అందరూ ఎంతగానో ఇష్టపడే వంటకాలు ఇక్కడ ఎన్నో ఉన్నాయి. అప్పడం రుచి ప్రపంచవ్యాప్తంగా చాలామంది ప్రజలకు ఎంతో ఇష్టం. అప్పడం భారతీయ వంటకాలలో ముఖ్యమైనదిగా పేరొందింది. వివాహ వేడుక అయినా, విందు అయినా పాపడ్ భారతీయులకు పాపడ్‌ ఉండాల్సిందే. క్రంచీ, స్పైసీతో కూడిన పాపడ్ ఇతర ఆహారపు  రుచులను మరింతగా పెంచుతుంది. అయితే  అందరూ ఎంతో ఇష్టంగా తినే పాపడ్ ఎలా పుట్టిందో, భారతీయుల ఆహారంలో అది ఎలా ప్రధాన భాగమైందో ఇప్పుడు తెలుసుకుందాం. 

పాపడ్‌కు ఘన చరిత్ర 
చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో మక్కువతో పాపడ్‌ను తింటారు. ఆహారపు రుచిని పెంచే ఈ కరకరలాడే పాపడ్ చరిత్ర 500 బీసీ అంటే 2500 సంవత్సరాల నాటిదని తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. ఈ సమాచారం ఆహార చరిత్రకారుడు, రచయిత కెటి ఆచార్య రాసిన 'ఎ హిస్టారికల్ డిక్షనరీ ఆఫ్ ఇండియన్ ఫుడ్'లో కనిపిస్తుంది. మినప్పుప్పు, పెసర పప్పుతో చేసిన పాపడ్ గురించి అతని పుస్తకంలో ప్రస్తావించారు. మరోవైపు భారతదేశంలో దాని చరిత్ర గురించి చెప్పాలంటే ఇక్కడ పాపడ్‌కు 1500 సంవత్సరాల చరిత్ర ఉంది. 

పాపడ్ తయారీకి అనువైన సింధ్
అప్పడానికి సంబంధించిన తొలి ప్రస్తావన జైన సాహిత్యంలో కనిపిస్తుంది. పాపడ్ అనేది మార్వార్ జైన సమాజంలో కనిపిస్తుంది. ఇక్కడి ప్రజలు ప్రయాణాల్లో పాపడ్‌ను తీసుకెళ్లేవారు. పాపడ్ ఇండియాకు రావడం అనే విషయానికొస్తే ఇది మన పొరుగు దేశం పాకిస్తాన్ నుండి ఇక్కడకు చేరుకుంది. పాపడ్ తయారీకి సింధ్ (పాకిస్తాన్) సరైనదిగా పరిగణిస్తారు. ఎందుకంటే ఇక్కడ గాలి, అధిక ఉష్ణోగ్రత పాపడ్ తయారీకి అనువైనవి. 1947లో దేశ విభజన జరిగినప్పుడు చాలా మంది సింధీ హిందువులు భారతదేశానికి వలస వచ్చారు. వారు తమతో పాటు అప్పడాలు తీసుకువచ్చారు.
 
అప్పడానికి ఊరగాయ జతచేసి..
ఆ సమయంలో అది అక్కడి ప్రజల ప్రధాన ఆహారంగా మారింది. ఎందుకంటే పాపడ్ శరీరంలో నీటిని  నిలిపివుంచడంతో పాటు తాజాదనాన్ని కాపాడుకోవడంలో సహాయపడుతుందని భావించేవారు. రోజురోజుకు పాపడ్‌ వినియోగం పెరుగుతుండటంతో చాలామంది అప్పడాలను తయారు చేసి, వాటిని విక్రయిస్తూ డబ్బు సంపాదించసాగారు. పాకిస్తాన్ నుంచి భారత్‌కు వచ్చిన సింధీలు తమ జీవనోపాధి కోసం చాలా కష్టపడాల్సి వచ్చేది. అటువంటి పరిస్థితిలో పలువురు మహిళలు తమ కుటుంబాన్ని పోషించుకోవడానికి అప్పడాలు, ఊరగాయలు విక్రయించడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకునేవారు. 

అప్పడానికి ఎన్నో పేర్లు
మారుతున్న కాలంతో పాటు ఇప్పుడు అనేక రకాల పాపడ్‌లు పలు రుచులతో అందుబాటుకి వచ్చాయి. వీటిలో బియ్యం పాపడ్, రాగి పాపడ్, సజ్జ, బంగాళాదుంప, పప్పు, ఖిచియా పాపడ్ మొదలైనవి కూడా ఉన్నాయి. భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఆహారంలో అప్పడం అనేది ముఖ్యమైన భాగంగా మారింది. ఈ వివిధ దేశాలలో అప్పడాలను వేర్వేరు పేర్లతో పిలుస్తారు. తమిళనాడులో అప్పలమని పిలిస్తే, కర్ణాటకలో హప్పల అని అంటారు. కేరళలో పాపడమ్, ఒరిస్సాలో పంపా, ఉత్తర భారతదేశంలో పాపడ్ అని పిలుస్తారు.
ఇది కూడా చదవండి: స్నేహితుని స్థానంలో పరీక్షకు సిద్ధం.. బయోమెట్రిక్‌ మెషీన్‌లో వేలు పెట్టగానే..

Videos

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)