Breaking News

బిజినెస్‌ టైకూన్‌ కోడలి అనుమానాస్పద మరణం

Published on Wed, 11/26/2025 - 14:27

ఢిల్లీ:  Pan Masala Baron Daughter In Law Dies ప్రముఖ వ్యాపారవేత్త కమల్ కిషోర్ చౌరాసియా ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. కమల పాసంద్ పాన్ మసాలా ​‍ బ్రాండ్‌తో పాపులర్‌ అయిన కమల్‌ కోడలు దీప్తి చౌరాసియా (Deepti Chaurasia) (40) దక్షిణ ఢిల్లీలోని ఇంట్లో ఆత్మహత్య చేసుకుని మరణించింది. మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీలోని వసంత విహార్‌లోని ఇంట్లో ఆత్మహత్య చేసుకుని మరణించారని తెలుస్తోంది.

 దక్షిణ ఢిల్లీలోని ఇంట్లో దీప్తి చనిపోయి కనిపించారు. చున్నీతో  ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఆమె గదిలో  సూసైడ్‌ నోట్‌ లభించింది. తన మరణానికి ఎవరికీ సంబంధం లేదంటూనే,  రిలేషన్‌లో ప్రేమ, నమ్మకం లేకపోతే,  ఇక జీవితానికి అర్థం ఏముంది? అని తన నోట్‌లో పేర్కొనడం అనేక అనుమానాలకు  తావిస్తోంది.  

మరోవైపు భర్త హర్‌ప్రీత్‌ చౌరాసియాతో విభేదాలున్నట్టు  పేర్కొన్నా డైరీని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో కుటుంబ కలహాలే ఆమె ఆత్మహత్యకు ప్రేరేపించాయా అని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై వివరణాత్మక దర్యాప్తు జరుగుతోంది. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని,  పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించామని పోలీసులు తెలిపారు. ఈ  కేసుపై పోలీసులు ఇంకా బహిరంగ ప్రకటన చేయలేదు. 

ఇదీ చదవండి: H-1B వీసా స్కాం సంచలనం : ఏకంగా 220000 వీసాలా?

కాగా దీప్తి, కమల్ కిషోర్ కుమారుడు హర్‌ప్రీత్‌ చౌరాసియాను 2010లో వివాహం చేసుకున్నారు. వీరికి 14 ఏళ్ల కుమారుడు ఉన్నాడు.  కమల్ కిషోర్ గ్రూప్ వ్యవస్థాపకుడు, కమల్ కిషోర్ చౌరాసియా. ఇది కమలా పసంద్, రాజ్‌శ్రీ బ్రాండ్‌ పాన్ మసాలా, ఇతర పొగాకు ఉత్పత్తుల రంగంలో పనిచేస్తుంది. 

ఫ్యామిలీ  స్పందన
కమలా పసంద్ కుటుంబ న్యాయవాది రాజేందర్ సింగ్ దీనిపై వివరణ ఇచ్చారు. మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అబద్ధమననారు.  జరిగిన ఘటన చాలా దురదృష్టకరం. ఆమెకు పూర్తి గౌరవం ఇవ్వాలనే ఉద్దేశ్యంతో రెండు కుటుంబాలు ఈరోజు కలిసి దహన సంస్కారాలు చేయాలని నిర్ణయించుకున్నాయి. ఇది రెండు కుటుంబాలకు తీరని లోటు.  సూసైడ్ నోట్‌లో ఎటువంటి ఆరోపణ లేదు. దీనికి బాధ్యులుగా ఆమె ఎవరినీ ప్రత్యేకంగా పేర్కొనలేదు. ఆత్మహత్యకు కారణమేమిటో మాకు తెలియదు.  పోలీసులకు సహకరిస్తున్నామని రాజేందర్‌ తెలిపారు. 
 

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి