Breaking News

చొరబాటుదారుణ్ణి మట్టుబెట్టిన బీఎస్‌ఎఫ్‌

Published on Tue, 08/13/2024 - 12:57

రాబోయే స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సరిహద్దుల్లో భారత సైన్యం మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. తాజాగా పంజాబ్ సరిహద్దుల్లో ఓ పాకిస్తానీ చొరబాటుదారుడు భారత్‌లోకి చొరబడేందుకు  ప్రయత్నిస్తుండగా భద్రతా బలగాలు అతనిని మట్టుబెట్టాయి. ఈ విషయాన్ని స్వయంగా బీఎస్ఎఫ్ వెల్లడించింది.

ప్రస్తుతం సరిహద్దుల్లో హై అలర్ట్ అమలులో ఉందని బీఎస్‌ఎఫ్‌ అధికారి ఒకరు తెలిపారు. సోమవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో తరన్‌తారన్‌ జిల్లాలోని దాల్ గ్రామం వద్ద అంతర్జాతీయ సరిహద్దును దాటి కంచె సమీపంలోకి వస్తున్న వ్యక్తి  కనిపించాడని ఆయన తెలిపారు. అప్పుడు విధుల్లో ఉన్న బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది చొరబాటుదారునితో తిరిగి వెళ్లిపోవాలని సూచించారు. అయితే అతను అధికారుల సూచనలు వినకుండా సరిహద్దు భద్రతా కంచె వైపు వస్తూనే ఉన్నాడు.

ప్రమాదాన్ని పసిగట్టిన డ్యూటీలోని సైనికులు ఆ చొరబాటుదారునిపై కాల్పులు జరిపారు. అతను అక్కడికక్కడే మృతి చెందాడు. భారత ఆర్మీ మరోమారు చొరబాటుదారుడియత్నాన్ని విజయవంతంగా తిప్పికొట్టిందని ఆయన పేర్కొన్నారు. కాగా పంజాబ్‌లోని 553 కి.మీ. పొడవైన భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో హై అలర్ట్‌ కొనసాగుతోంది.

#

Tags : 1

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)