Breaking News

‘సిందూర్‌’పై అరగంట తర్వాతే పాక్‌కు సమాచారం: జైశంకర్‌

Published on Tue, 05/27/2025 - 05:52

న్యూఢిల్లీ: ఆపరేషన్‌ సిందూర్‌ మొదలైన అరగంట తర్వాతే దాని గురించి పాకిస్తాన్‌కు సమాచారమిచి్చనట్టు విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ వెల్లడించారు. ఆయన సారథ్యంలో పార్లమెంటు సంప్రదింపుల కమిటీ సోమవారం సమావేశమైంది. పహల్గాం దాడికి తెగబడ్డ ఉగ్ర మూకల పీచమణచేందుకు చేపట్టిన ఆ ఆపరేషన్‌తో పాటు పాక్‌ సీమాంతర ఉగ్రవాదం తదితరాలపై చర్చించింది. అన్ని పారీ్టల ఎంపీలూ భేటీలో పాల్గొన్నారు.

 ‘‘సిందూర్‌ గురించి ఆపరేషన్‌ మొదలైన అరగంటకు పాక్‌కు సమాచారమిచ్చాం. కేవలం ఉగ్ర శిబిరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నట్టు స్పష్టం చేశాం’’అని మంత్రి వెల్లడించారు. సైనిక చర్య గురించి పాక్‌కు జైశంకర్‌ ముందే సమాచారమిచ్చారని విపక్ష నేత రాహుల్‌గాంధీ కొద్దిరోజులుగా తీవ్ర ఆరోపణలు చేస్తుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఇలా స్పష్టతనివ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాల్పుల విరమణలో అమెరికా పాత్ర ఏ మాత్రమూ లేదని కూడా ఆయన స్పష్టం చేశారు. భారత డీజీఎంఓకు పాక్‌ డీజీఎంఓ విజ్ఞప్తి చేసిన కారణంగానే ఒప్పందం కుదిరిందని పునరుద్ఘాటించారు. 

‘‘పాక్‌ భారీ దాడికి సిద్ధమవుతోందని అమెరికా విదేశాంగ మంత్రి మనకు సమాచారమిచ్చారు. అదే జరిగితే అంతే స్థాయిలో వాళ్లకు బదులిస్తామని చెప్పాం’’అన్నారు. సిందూర్‌ అనంతర ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్, పాక్‌ నడుమ అణుయుద్ధం తరహా పరిస్థితి నెలకొందన్న వాదన పూర్తిగా సత్యదూరమని జర్మనీ వార్తాపత్రిక ఫజ్‌కు ఇచి్చన ఇంటర్వ్యూలో జైశంకర్‌ స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని పాక్‌ ఓ వ్యాపారంగా బాహాటంగా నిర్వహిస్తోందంటూ నిప్పులు చెరిగారు. పాక్‌ ప్రభుత్వం, సైన్యం ఉగ్రవాదానికి అన్నివిధాలా వెన్నుదన్నుగా నిలుస్తూ పెంచి పోషిస్తున్నాయని మండిపడ్డారు.  
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)