Breaking News

సీమాంతర ఉగ్రవాదానికి కొత్త రెడ్‌లైన్‌

Published on Wed, 06/04/2025 - 05:08

పుణే: వెయ్యిసార్లు గాయపర్చడం ద్వారా భారత్‌ను రక్తసిక్తం చేయాలన్న విధానాన్ని పాకిస్తాన్‌ అమలు చేస్తోందని ఇండియా చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌(సీడీఎస్‌) జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ చెప్పారు. ఆపరేషన్‌ సిందూర్‌ ద్వారా సీమాంతర ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కొత్త రెడ్‌లైన్‌ గీశామని చెప్పారు. మంగళవారం మహారాష్ట్రలోని సావిత్రిబాయి ఫూలే పుణే యూనివర్సిటీలో ‘భవిష్యత్తు యుద్ధాలు, యుద్ధ రీతులు’ అనే అంశంపై ఆయన ప్రసంగించారు. యుద్ధంలో జరిగిన చిన్నచిన్న తప్పిదాల కంటే అంతిమంగా ఏం సాధించామన్నదే చాలా ముఖ్యమని తేల్చిచెప్పారు.

తాత్కాలిక నష్టాల కారణంగా సైన్యంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని వెల్లడించారు. ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో కొన్ని యుద్ధ విమానాలు కోల్పోయామంటూ తాను చేసిన ప్రకటనను కొందరు తప్పుపట్టడాన్ని జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ ఖండించారు. మనవైపు జరిగిన నష్టం గురించి మీడియా ప్రతినిధులు అడిగినప్పుడు స్పందించానని చెప్పారు. ఇలాంటి చిన్నపాటి నష్టాలకు ఏమాత్రం ప్రాధాన్యం లేదని, ఫలితాన్నే పరిగణనలోకి తీసుకోవాలని అప్పుడే స్పష్టంచేశానని ఉద్ఘాటించారు. శత్రువు పట్ల మన ప్రతిస్పందన ఎలా ఉందన్నదే కీలకమని వ్యాఖ్యానించారు. జరిగిన నష్టం గురించి, అంకెల గురించి మాట్లాడుకోవడం సరైంది కాదన్నారు.

యుద్ధంలో ఎలాంటి నష్టం జరిగినా సైన్యం నైతిక స్థైర్యం కాపాడుకోవాలన్నారు. యుద్ధం, హింస ఉన్నచోట రాజకీయ జోక్యం కూడా ఉంటుందని తెలియజేశారు. ఆపరేషన్‌ సిందూర్‌లోనూ అదే జరిగిందని చెప్పారు. పహల్గాం ఉగ్రవాద దాడి కంటే కొన్ని వారాల ముందు పాకిస్తాన్‌ సైన్యాధిపతి జనరల్‌ అసీం మునీర్‌ భారత్‌కు, హిందువులకు వ్యతిరేకంగా విషం కక్కారని అనిల్‌ చౌహాన్‌ గుర్తు చేశారు. భారత్‌ పట్ల దశాబ్దాలుగా కొనసా గుతున్న పాకిస్తాన్‌ విద్వేషాన్ని ఆయన మాటలు ప్రతిబింబించాయని తెలిపారు. భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని ఎగదోస్తే ఇకపై తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆపరేషన్‌ సిందూర్‌ పాకిస్తాన్‌కు తెలి యజెప్పామని పేర్కొన్నారు. ఉగ్రవాద దాడులకు, అణు బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదన్నారు.

పాక్‌పై నిర్ణయాత్మక విజయం 
48 గంటలపాటు నిర్విరామంగా దాడులు చేసి ఇండియాను ఓడించాలని ప్రణాళిక సిద్ధం చేసిన పాకిస్తాన్‌ కేవలం 8 గంటల్లోనే చేతులెత్తేసిందని అనిల్‌ చౌహాన్‌ అన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌లో భారత్‌ దాడులను తట్టుకోలేక పాకిస్తాన్‌ కాళ్లబేరానికి వచ్చిందని పేర్కొన్నారు. ఆ ఆపరేషన్‌ ఇంకా కొనసాగితే చావుదెబ్బ తప్పదన్న సంగతికి పాక్‌కు తెలిసిపోయిందని వెల్లడించారు. కాల్పుల విరమణ, చర్చల ప్రతిపాదన తొలుత పాకిస్తాన్‌ నుంచే వచ్చిందని స్పష్టంచేశారు. ఆపరేషన్‌ సిందూర్‌లో పాకిస్తాన్‌పై నిర్ణయాత్మక విజయం సాధించామని మరోసారి తేల్చిచెప్పారు. పాకిస్తాన్‌కు ‘ఇన్నింగ్స్‌ డిఫీట్‌’ మిగిలిందని అన్నారు. ఈ ఆపరేషన్‌ ఇంకా ముగిసిపోలేదని, పాకిస్తాన్‌తో ఘర్షణ తాత్కాలికంగా ఆగిపోయిందని తెలిపారు.

Videos

వైరల్ అవుతున్న ప్రభాస్ చెల్లెల లేటెస్ట్ ఫోటోలు..

చెవిరెడ్డి పోరాటం.. నామినేషన్లు సక్సెస్

ఏపీ స్థానిక ఎన్నికలపై సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు

విజయవాడలో YSRCP ఎన్నికల ప్రచార హోరు

కడప ZP ఆఫీస్ లో నామినేషన్ల స్క్రూటినీ.. వీడియో వైరల్

మహిళలపై TDP మూకలు ఎలా దాడి చేశారో చూడండి

చింతమనేని మోసం చేశాడు.. వాపోయిన జనసేన దెందులూరు ఇంచార్జ్ వెంకటలక్ష్మి

ప్రచారంలో దూసుకుపోతున్న YSRCP వరుదు కళ్యాణి

మార్కెట్లో జియో మెగా సునామీ.. అప్లై చేసిన వారికి షేర్లు దక్కుతాయా?

ABN రాధాకృష్ణ... నీ ఫామ్ హౌస్ బాగోతం.. కారుమూరి సంచలన కామెంట్స్

Photos

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్