Breaking News

హిందూ భక్తులను అనుమతించని పాక్‌.. ఎంట్రీకి నిరాకరణ

Published on Thu, 11/06/2025 - 08:09

చండీగఢ్‌: ‘మీరు హిందువులు కాబట్టి సిక్కులతో కలిసి వెళ్లలేరు’.. అంటూ భారత్‌కు చెందిన హిందూ భక్తుల బృందాన్ని పాకిస్తాన్‌ అడ్డుకుంది. దీంతో గురునానక్‌ దేవ్‌ జయంతి ఉత్సవాలలో పాల్గొనేందుకు పాక్‌ వెళ్లిన ఏడుగురు హిందూ భక్తులు.. కుటుంబ సభ్యులతో సహా వెనక్కి తిరిగి వచ్చారు.

కాగా, దాదాపు 1,900 మంది సిక్కు భక్తులున్న ఒక బృందం, గురు నానక్‌ దేవ్‌ ‘ప్రకాశ్‌ పర్బ్‌’ వేడుకల్లో పాల్గొనేందుకు మంగళవారం అటారీ–వాఘా సరిహద్దు మీదుగా పాకిస్తాన్‌లోకి ప్రవేశించింది. ‘ఏడుగురు సభ్యుల బస్సు టికెట్ల కోసం 95,000 పాకిస్తానీ కరెన్సీ ఖర్చు చేశాం’.. అని బృంద సభ్యుడైన అమర్‌ చంద్‌ తెలిపారు. ఆ తర్వాత ఐదుగురు పాకిస్తాన్‌ అధికారులు వచ్చి ‘మీరు హిందువులు కాబట్టి.. సిక్కుల జాతాతో వెళ్లలేరని మాతో చెప్పారు’.. అని పేర్కొన్నారు.

అనంతరం తమను వెనక్కి పంపేశారని తెలిపారు. బస్సు టికెట్ల కోసం ఖర్చు చేసిన డబ్బును కూడా వెనక్కి ఇవ్వలేదని వివరించారు. గతంలో పాకిస్తాన్‌ జాతీయుడైన చంద్, 1999లో భారత్‌కు వచ్చి 2010లో భారత పౌరసత్వం పొందారు. ముందుగా, పొరుగు దేశంతో నెలకొన్న ఉద్రిక్త  పరిస్థితుల దృష్ట్యా గురు నానక్‌ దేవ్‌ ‘ప్రకాశ్‌ పర్బ్‌’కు సిక్కు భక్తులను పాకిస్తాన్‌కు పంపడానికి కేంద్రం నిరాకరించింది. అనంతరం సిక్కుల ‘జాతా’ను పాకిస్తాన్‌లోని గురుద్వారాల సందర్శనకు అనుమతించింది. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)