Breaking News

మసూద్‌ అజార్‌కు రూ.14 కోట్లు

Published on Sat, 05/17/2025 - 04:23

భుజ్‌: జైషే మొహమ్మద్‌ అధినేత మసూద్‌ అజార్‌కు రూ.14 కోట్లు ఇవ్వాలని పాకిస్తాన్‌ ప్రభుత్వం నిర్ణయించిందని భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆరోపించారు. భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలపాలను మరింత విస్తృతం చేయడానికి ప్రజల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తోందని ధ్వజమెత్తారు. 

ఆపరేషన్‌ సిందూర్‌లో ధ్వంసమైన ఉగ్రవాదుల మౌలిక సదుపాయాలను, జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా శిబిరాలను పాక్‌ ప్రభుత్వం మళ్లీ నిర్మిస్తోందని చెప్పారు. మురిద్కే, బహవల్‌పూర్‌లో ఈ నిర్మాణాలు మొదలయ్యాయని వెల్లడించారు. శుక్రవారం గుజరాత్‌లోని భుజ్‌లో రాజ్‌నాథ్‌ సింగ్‌ పర్యటించారు. భుజ్‌ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లో సైనికాధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. అనంతరం జవాన్లను ఉద్దేశించి మాట్లాడారు. పాకిస్తాన్‌ ప్రజల నుంచి ప్రభుత్వం వసూలు చేస్తున్న సొమ్మంతా ఉగ్రవాదుల జేబుల్లోకే వెళ్తుందని ఆందోళన వ్యక్తంచేశారు.  

పాకిస్తాన్‌కు ఆర్థిక సాయంపై ఐఎంఎఫ్‌ పునరాలోచించాలి 
పాకిస్తాన్‌కు ఎవరైనా ఆర్థిక సాయం అందిస్తే ఆ సొమ్మంతా ఉగ్రవాద కార్యకలాపాలకే ఖర్చవుతుందని రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. విదేశాల నుంచి వచ్చే డబ్బుతో భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాదులను ఎగదోయడం పాకిస్తాన్‌కు అలవాటేనని మండిపడ్డారు. ఆ దేశానికి 2.3 బిలియన్‌ డాలర్ల ఆర్థిక సాయం అందించడంపై పునరాలోచన చేయాలని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్‌)ను కోరారు.  దుష్ట పాకిస్తాన్‌ సంగతి తెలిసి కూడా పెద్ద మొత్తంలో నిధులు ఇవ్వాలనుకోవడం సరైంది కాదని చెప్పారు. 

ఇప్పుడున్న పరిస్థితుల్లో పాకిస్తాన్‌కు ఆర్థిక సాయం అందిస్తే ఉగ్రవాదులకు సాయం చేసినట్లేనని పేర్కొన్నారు. అందుకే పాక్‌కు ఆర్థిక సాయంపై మరోసారి ఐఎంఎఫ్‌ ఆలోచించాలని, భవిష్యత్తులో ఎలాంటి సాయం అందించకూడదని విజ్ఞప్తి చేశారు. ఉగ్రవాదం అంతమయ్యే దాకా తమ పోరాటం ఆగదని రాజ్‌నాథ్‌ సింగ్‌ పునరుద్ఘాటించారు. ఉగ్రవాదంపై ఇప్పటిదాకా తాము తీసుకున్న చర్యలన్నీ కేవలం ట్రైలర్‌ మాత్రమేనని, అవసరమైతే ఫుల్‌ పిక్చర్‌ చూపిస్తామని వ్యాఖ్యానించారు. ఆపరేషన్‌ సిందూర్‌ ఇంకా ముగియలేదని స్పష్టంచేశారు.  

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)