Breaking News

భారత సరిహద్దుల్లో టెన్షన్‌.. పాక్‌ ఆర్మీ కాల్పులు

Published on Fri, 04/25/2025 - 07:44

శ్రీనగర్‌: భారత్‌, పాకిస్తాన్‌ సరిహద్దుల్లో ఉద్రికత్త నెలకొంది. పాక్‌ కవ్వింపు చర్యలకు దిగింది. నియంత్రణ రేఖ వెంబడి పాక్‌ ఆర్మీ దుశ్చర్యకు పాల్పడుతోంది. శుక్రవారం తెల్లవారుజామున కాల్పులకు తెగబడింది. పాకిస్థాన్‌ ఆర్మీ కాల్పులు జరపడంతో భారత భద్రతా బలగాలు ప్రతి దాడులు చేస్తున్నాయి. దీంతో, సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. పాక్‌ ఆర్మీ కాల్పులను భారత సైన్యం తిప్పికొట్టింది. 

వివరాల ప్రకారం.. పహల్గాం ఉగ్రదాడితో భారత్‌, పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ సరిహద్దుల్లో అలజడి చోటుచేసుకుంది. పాక్‌ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి దుశ్చర్యకు పాల్పడింది. నియంత్రణ రేఖ వెంబడి పలు ప్రాంతాల్లో పాక్‌ పోస్టుల నుంచి కాల్పులకు తెగబడింది. శుక్రవారం తెల్లవారుజామున కాల్పులు జరిపింది. దీంతో, శత్రువుల దాడిని భారత ఆర్మీ సమర్థంగా ఎదుర్కొంటోంది. పాక్‌ సైన్యం కాల్పులకు దీటుగా బదులిస్తోంది.  

మరోవైపు జమ్ముకశ్మీర్‌లోని బందీపురాలో ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. బందీపురాలో భద్రతా బలగాలు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో, భద్రతా బలగాలు సైతం కాల్పులు ప్రారంభించాయి. ఈ ఎన్‌కౌంటర్‌పై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

 

Videos

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)