Breaking News

నెట్టింట 'డీప్‌గా' నకిలీలు

Published on Wed, 02/11/2026 - 04:57

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) ద్వారా ప్రపంచవ్యాప్తంగా సెలబ్రిటీల డీప్‌ఫేక్‌ ప్రకటనలు, క్లోన్డ్‌ వాయిస్‌లు, వీడియోలు సామాజిక మాధ్యమాలను ముంచెత్తుతున్నాయి. 2025లో ఏకంగా 80 లక్షల డీప్‌ఫేక్‌ ఫైల్స్‌ ఆన్‌లైన్‌లోకి చొచ్చుకుపోయాయి. 

ఈ వీడియోల కారణంగా బాధితుల కీర్తిప్రతిష్టలకు భంగం కలగడంతోపాటు సైబర్‌ నేరగాళ్లు ఆర్థిక మోసాలకు పాల్పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అయితే ఇటువంటి కంటెంట్‌కు సోషల్‌ మీడియా వేదికలు ‘ఏఐతో రూపొందించినది’ అని యూజర్లకు కనిపించేలా ప్రసారం చేయాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆదేశించడం కాస్త ఉపశమనం కలిగించే అంశం.  – సాక్షి, స్పెషల్‌ డెస్క్‌

సైబర్‌ నేరగాళ్ల లక్ష్యం ఎవరంటే..
» ఫేక్‌ యాడ్స్, గౌరవానికి భంగం కలిగించే డీప్‌ఫేక్‌ వీడియోల్లో 40% సెలబ్రిటీలు, ప్రముఖులు ఉన్నారు.
»  వేధింపులు, మోసాలకు సంబంధించిన వీడియోలతో బాధితులుగా మిగిలిన వారిలో 35% మంది ప్రైవేట్‌ వ్యక్తులు.
»  ప్రైవేట్‌ ఫొటోలు, వీడియోలు, డీప్‌ఫేక్‌ కంటెంట్‌తో సైబర్‌ నేరగాళ్లు లక్ష్యంగా చేసుకున్న వారిలో 99% మంది మహిళలే.
»  వ్యాపారులు లక్ష్యంగా నకిలీ ప్రొఫైల్స్, బ్రాండ్‌ పేరుతో 40% మోసాలు జరుగుతున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా డీప్‌ఫేక్‌ కంటెంట్‌ విస్తృతి ఇలా..
»  గతేడాది 80 లక్షలకుపైగా డీప్‌ఫేక్‌ ఫైల్స్‌ ఆన్‌లైన్‌లో చక్కర్లు కొట్టాయని అంచనా.
»  ఏటా ఈ కంటెంట్‌ 900% అధికం అవుతోంది.
»    2023తో పోలిస్తే డీప్‌ఫేక్‌ ఫైల్స్‌ గత ఏడాదికి 1,500% పెరిగాయి. 
»  ఇటువంటి కంటెంట్‌ ఉత్తర అమెరికాలో ఏకంగా 1,740%, ఆసియా పసిఫిక్‌లో 1,530% పెరిగింది.
»   డీప్‌ఫేక్‌ కంటెంట్‌లో సింహభాగం వీడియోలు కైవసం చేసుకున్నాయి.

డీప్‌ఫేక్‌తో అంతర్జాతీయంగా ఆర్థిక మోసాలు..
» డీప్‌ఫేక్‌ కంటెంట్‌ను ఆసరాగా చేసుకుని జరుగుతున్న మోసాలు ఏడాదిలో 3,000% అధికం అయ్యాయి.
» వాయిస్‌ క్లోనింగ్‌ విధానం సైబర్‌ నేరగాళ్ల మోసాల్లో సర్వసాధారణం
» డీప్‌ఫేక్‌ కంటెంట్‌ కారణంగా గరిష్టంగా ఒక బాధితుడు నష్టపోయిన మొత్తం రూ.2.18 కోట్లు.
» కంపెనీలు, ఫైనాన్స్‌ టీమ్స్, కుటుంబాలను సైబర్‌ నేరగాళ్లు లక్ష్యంగా చేసుకున్నారు. 

డీప్‌ఫేక్‌ ఖాతాలు ప్రపంచవ్యాప్తంగా ఇలా..
సంవత్సరం    సంఖ్య
2019         15,000
2022         5 లక్షలు
2023        10 లక్షలు

డీప్‌ఫేక్‌ దుర్వినియోగంపై అంతర్జాతీయంగా నమోదైన కేసులు..
సంవత్సరం                     కేసుల సంఖ్య
2024                               150
2025 జనవరిృమార్చి           179

(ఆధారం: లాత్వియాకు చెందిన ఫోరెన్సిక్‌ డివైజెస్, ఐడెంటిటీ వెరిఫికేషన్‌ సొల్యూషన్స్‌ కంపెనీ రెగ్యులా)  

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)