Breaking News

అతివేగంతోనే.. అత్యధిక ప్రమాదాలు!

Published on Sun, 10/05/2025 - 06:09

దేశంలో 2023లో జరిగిన ప్రమాదాల్లో 4.44 లక్షల మంది మరణించారు. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు, రైల్వే ప్రమాదాలు, రైల్వే క్రాసింగ్‌ ప్రమాదాల 
వంటి ‘ట్రాఫిక్‌ ప్రమాదాల్లో’ 1.98 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం రోడ్డు ప్రమాదాల్లో 45.8 శాతం ద్విచక్ర వాహనాల వల్లే జరిగాయి. రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం.. అతివేగమే. ఇలా మొత్తం 2.81 యాక్సిడెంట్లలో 1.02 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం రోడ్డు ప్రమాదాల్లో అత్యధికంగా 20.7 శాతం సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల్లోపే జరిగాయి. ప్రకృతి వైపరీత్యాల వల్ల 2023లో 6,444 మంది ప్రాణాలు కోల్పోయారు.

మహారాష్ట్రలో అత్యధికంగా 69,809 మంది ప్రమాదాల్లో మరణించగా, ఆ తరువాతి స్థానాల్లో మధ్యప్రదేశ్‌ (43,320), ఉత్తరప్రదేశ్‌ (43,207) ఉన్నా­యి. ఆంధ్రప్రదేశ్‌లో 19,949 ప్రమాదాల్లో 17,039 మరణించగా, తెలంగాణలో 22,903 ప్రమాదాల్లో 13,374 మంది ప్రాణాలు కోల్పోయారు.

ట్రాఫిక్‌ మరణాలు..: రోడ్డు ప్రమాదాలు, రైల్వే ప్రమాదాలు, రైల్వే క్రాసింగ్‌ ప్రమాదాలు.. వీటిలో ప్రా­ణాలు కోల్పోయిన వారిని ‘ట్రాఫిక్‌ మరణాల’ కింద పరిగణించారు. 2019లో ఇలా 1.81 లక్షల మంది మరణిస్తే.. 2023 నాటికి ఈ సంఖ్య 1.98 లక్షలకు పెరిగింది. తెలంగాణలో 23,673  ట్రాఫిక్‌ ప్రమాదాల్లో 8,345 మంది మరణించగా.. ఏపీలో 21,078 కేసుల్లో 9,284 మంది ప్రాణాలు కోల్పోయారు.

టూ వీలర్లే అత్యధికం
మొత్తం రోడ్డు ప్రమాదాల్లో 45.8 శాతం ద్విచక్ర వాహనాల వల్లే జరిగాయి. కారు, జీపు, ఎస్‌యూవీల వల్ల 14.3 శాతం జరగ్గా.. ఆటోల వంటి త్రీవీలర్ల వల్ల 4.1 శాతం సంభవించాయి.

అతివేగం అనర్థదాయకం
రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం పరిమితికి మించిన వేగంతో వెళ్లడమే. ఇలా 58.6 శాతం ప్రమాదాలు జరిగాయి. మొత్తం 2.81 యాక్సిడెంట్లలో 1.02 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్, ఓవర్‌ టేకింగ్‌ వంటి వాటివల్ల 23.6 శాతం యాక్సిడెంట్లు సంభవించాయి. మాదక ద్రవ్యాలు, మద్యం సేవించి వాహనం నడపడం వల్ల 2.1 శాతం ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.

మొత్తం రోడ్డు ప్రమాదాల్లో 60.2 శాతం (2.80 లక్షల కేసులు) గ్రామీణ ప్రాంతాల్లో నమోదు కాగా.. 39.8 శాతం 
(1.84 లక్షలు) పట్టణాల్లో జరిగాయి.

రాత్రిపూటే అధికం
మొత్తం రోడ్డు ప్రమాదాల్లో అత్యధికంగా 20.7 శాతం (95,984) సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల్లోపే సంభవించాయి. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల్లోపు 17.3 శాతం, మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల్లోపు 15 శాతం సంభవించాయి.  

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)