Breaking News

సభలో రగడ ఆగేనా? 

Published on Mon, 07/27/2026 - 04:58

సాక్షి, న్యూఢిల్లీ: సీజేపీ ఉద్యమంతో మోదీ సర్కార్‌పై పెరిగిన ఒత్తిడిని పార్లమెంట్‌లోనూ కొనసాగించాలని విపక్షాల ‘ఇండియా’ కూటమి పార్టీలు నిర్ణయించాయి. చలో సంసద్‌ ర్యాలీలో విద్యార్థులను విచక్షణారహితంగా చితకబాదిన, పెల్లెట్‌ గన్స్‌ ఉపయోగిస్తూ కొనసాగిన పోలీస్‌ చర్యకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పార్లమెంట్‌లో విపక్ష పార్టీలు డిమాండ్‌ చేయనున్నాయి. పార్లమెంట్‌ ఉభయసభలు సోమవారం నుంచి పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో విపక్షాలు కొత్త వ్యూహాలతో ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. 

పోటీపరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీల నివారణకు ఉద్దేశించి కొత్త ముసాయిదా బిల్లును ప్రభుత్వం తీసుకొస్తున్న నేపథ్యంలో దానికి మద్దతు ఇవ్వాలా వద్దా అనే దానిపై సోమవారం  పార్లమెంట్‌లో ఖర్గే చాంబర్‌లో సమావేశమై ‘ఇండియా’ కూటమి నేతలు తుది నిర్ణయం తీసుకోనున్నారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. విద్యార్థులపై దాడికి నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని మోదీ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. 

దీంతో సోమవారం నుంచి ప్రారంభమయ్యే ఉభయసభల్లో మరోమారు వాగ్వాదాల వేడి రాజుకోనుందని స్పష్టమవుతోంది. మరోవైపు నీట్‌ అంశంపై ఆందోళనలు సాగిస్తున్న విద్యార్థుల పట్ల భద్రతా బలగాలు అతిగా వ్యవహరించాయని, దీనిపై రాజ్యసభలో చర్చ చేపట్టాలని కోరుతూ టీఎంసీ రాజ్యసభ ఉప నేత సాగరికా ఘోష్‌ ఆదివారం నోటీసు ఇచ్చారు. 267వ నిబంధన ప్రకారం సభలో ఆరోజు జరగాల్సిన కార్యక్రమాలను రద్దు చేసి, ఈ అంశంపై చర్చను చేపట్టాలని రాజ్యసభ సెక్రటరీ జనరల్‌కు పంపిన నోటీస్‌లో సాగరిక పేర్కొన్నారు.

నేటి నుంచి సభలో బిల్లులు 
→ పరీక్షల్లో అక్రమాలు, పేపర్‌ లీకేజీలను అరికట్టడమే లక్ష్యంగా రూపొందించిన ‘పబ్లిక్‌ ఎగ్జామినేషన్స్‌(అన్యాయమైన మార్గాల నిరోధక) సవరణ బిల్లు–2026’ను లోక్‌సభ ముందుకు తీసుకురానున్నారు.  

→ ఇదివరకే రాజ్యసభలో ప్రవేశపెట్టిన ‘వందేమాతరం’బిల్లుపై చర్చ జరుగనుంది. దీనిపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా స్వయంగా సమాధానం ఇవ్వనున్నారు. వందేమాతరం గేయాన్ని అవమానిస్తే మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించే ప్రతిపాదనలు ఈ బిల్లులో ఉండటంతో చర్చ ఆసక్తికరంగా మారనుంది.  

→ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య(సవరణ) బిల్లు–2026 కూడా పార్లమెంట్‌ ముందుకు రానుంది. సుప్రీంకోర్టులో న్యాయ మూర్తుల సంఖ్యను పెంచేందుకు ఉద్దేశించిన ఈ సవరణ బిల్లు చర్చల జాబితాలో ఉంది.   
 

Videos

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

ఓ బ్రాహ్మణ్ పై కక్ష్య సాధిస్తే... వేమిరెడ్డి దంపతులు ఇది నా ఆక్రందన! శ్రావణ్ శర్మ సతీమణి

సచివాలయం ఉద్యోగులను ఎలా ఈడ్చుకెళ్తున్నారో చూడండి

ఈసీ నియామక విధానంపై జగన్ ప్రశ్నలు.. అసలు వివాదం ఏంటి?

పాత అంబులెన్సుకు కొత్త రంగులు వేసిన ఏపీ సర్కారు

సిగ్గుందా చంద్రబాబు..! ఉద్యోగులంటే బానిసలనుకున్నారా..?

పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. నెలకు అకౌంట్లోకి 20,000

హిమాలయాల్లో పెను సునామీ! 200 కోట్ల మందికి డేంజర్ బెల్స్!

ఆసియా గేమ్స్ మహిళల కబడ్డీలో భారత్ కు స్వర్ణం

ఇది కచ్చితంగా ప్రభుత్వ హత్యే... కాకుమానుపై పోలీసుల తీరు.. అడ్వకేట్ రజినీ షాకింగ్ నిజాలు

Photos

+5

'ప్యారడైజ్'లో కేసీఆర్‌ని పోలిన పాత్ర.. షూటింగ్‌లో ఇలా(ఫొటోలు)

+5

బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వైబ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు.. ట్యాంక్ బండ్ వద్ద భారీ క్యూ...(ఫొటోలు)

+5

చూడప్పా సిద్ధప్పా.. సింహం గడ్డం గీసేసిందప్పా! (ఫొటోలు)