Breaking News

రామ మందిర ప్రతిష్టాపన: విపక్ష నేతలకు ఆహ్వానం

Published on Thu, 12/21/2023 - 13:07

లక్నో: అయోధ్యలో జనవరి 22న జరగనున్న రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి కీలక విపక్ష నేతలకు కూడా ఆహ్వానం అందింది. కాంగ్రెస్ సీనియర్ నేతలు సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్, మల్లికార్జున్ ఖర్గే, అధిర్ రంజన్ చౌదరి, జేడీ(ఎస్) అధినేత దేవేగౌడలకు ఆహ్వానాలు పంపినట్లు విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ తెలిపారు. రానున్న రోజుల్లో మరింత మంది విపక్ష నేతలకు ఆహ్వానాలు అందే అవకాశం ఉందని సమాచారం.  అయితే.. ఈ కార్యక్రమానికి విపక్ష నేతలు గౌర్హాజరయ్యే అవకాశం ఉంది. 

ప్రధానమంత్రి నరేంద్రమోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ వేడుకకు హాజరవనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన సన్నాహాలు ఇప్పటికే జోరందుకున్నాయి.  జనవరి 15 నాటికి ఏర్పాట్లన్నీ పూర్తి కానున్నాయి. ప్రాణ ప్రతిష్ట పూజ జనవరి 16న ప్రారంభమై జనవరి 22కు ముగియనుంది. 

రామ మందిర ప్రతిష్ఠాపన వేడుకలో భాగంగా జనవరి 17న 100 దేవతా విగ్రహాలతో శ్రీరాముడి జీవితంలోని దృశ్యాలను ప్రదర్శిస్తూ ఊరేగింపు ఉంటుంది. ఈ ఊరేగింపులో శ్రీరాముడు పుట్టినప్పటి నుంచి వనవాసం వరకు సాగిన జీవితం, లంకపై విజయం, అయోధ్యకు తిరిగి రావడం వంటి చిత్రాలు ఉంటాయని ప్రధాన శిల్పి రంజిత్ మండల్ తెలిపారు.  

ఇదీ చదవండి: లాలూ, తేజస్వీలకు ఈడీ సమన్లు

Videos

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)