Breaking News

నిరంతరం అప్రమత్తంగా ఉండండి: ప్రధాని మోదీ

Published on Fri, 05/09/2025 - 03:25

సాక్షి, న్యూఢిల్లీ:  ఆపరేషన్‌ సిందూర్, తదనంతర పరిస్థితుల నేపథ్యంలో నిత్యం అప్రమత్తంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశించారు. వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల మధ్య స్పష్టమైన సమాచార వ్యవస్థ, సంసిద్ధత అత్యంత కీలకమని స్పష్టం చేశారు. జాతీయ భద్రత పట్ల ప్రభుత్వం పూర్తి అంకితభావంతో ఉందని పునరుద్ఘాటించారు. గురువారం వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల కార్యదర్శులతో ప్రధానమంత్రి ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. 

కేబినెట్‌ కార్యదర్శి, ప్రధానమంత్రి కార్యాలయ సీనియర్‌ అధికారులు, రక్షణ, హోం, విదేశాంగ వ్యవహారాలు, సమాచార, విద్యుత్, ఆరోగ్యం, టెలికమ్యూనికేషన్స్‌ వంటి కీలక మంత్రిత్వ శాఖల కార్యదర్శులు పాల్గొన్నారు. జాతీయ భద్రత, మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయం వంటి అంశాలను ప్రధాని మోదీ సమీక్షించారు. పాకిస్తాన్‌తో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రభుత్వ శాఖల సన్నాహాలు, ప్రణాళికలను ఆరా తీశారు. కార్యదర్శులు తమ మంత్రిత్వ శాఖల కార్యకలాపాలను సమగ్రంగా సమీక్షించాలని పేర్కొన్నారు.

 అత్యవసర ప్రతిస్పందన, కమ్యూనికేషన్‌ ప్రొటోకాల్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఆదేశించారు. పౌర రక్షణ యంత్రాంగాన్ని బలోపేతం చేయడంతోపాటు తప్పుడు సమాచారం, నకిలీ వార్తల వ్యాప్తిని సమర్థంగా నియంత్రించేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. రాష్ట్రాల అధికారులతో పాటు క్షేత్రస్ధాయి సంస్థలతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని ప్రధానమంత్రి స్పష్టంచేశారు. ఎలాంటి విపత్కర పరిణామాలు ఎదురైనా తగిన రీతిలో ప్రతిస్పందించేందుకు సిద్ధంగా ఉన్నామని పలువురు కార్యదర్శులు చెప్పారు.   
 

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి