Breaking News

వాడీవేడిగా జేపీసీ తొలి భేటీ

Published on Wed, 01/08/2025 - 09:32

న్యూఢిల్లీ: పార్లమెంట్‌లో లోక్‌సభ, రాష్ట్రాల్లో శాసనసభలకు జమిలి ఎన్నికలకు సంబంధించిన బిల్లును సమీక్షిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ తొలి సమావేశమే వాడీవేడి చర్చకు వేదికగా మారింది. బిల్లులపై చర్చ సందర్భంగా రాజ్యాంగం మౌలిక రూపాన్ని మార్చే కుట్ర జరిగిందని, ఈ బిల్లుకు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని విపక్ష పార్టీల సభ్యులు గట్టిగా వ్యతిరేకించారు. ప్రజాభీష్టం మేరకే ఈ బిల్లులను తెచ్చామని మూడోసారి పీఠంపై కూర్చున్న ఎన్‌డీఏ కూటమి సభ్యులు తేల్చి చెప్పారు. 

దీంతో 39 మంది సభ్యులతో కొలువైన జేపీసీ తొలి భేటీ ఆద్యంతం తీవ్రస్థాయిలో వాదోప వాదాలతో కొనసాగింది. బుధవారం ఢిల్లీలో జేపీసీ సమావేశం తొలిరోజు సందర్భంగా సభ్యులందరికీ కేంద్ర న్యాయ శాఖ ఉన్నతాధికారులు సంబంధిత బిల్లుల్లోని కీలక అంశాలు, నియమనిబంధనలను పూర్తిగా విడమరచి చెప్పారు. కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా మాట్లాడారు. జమిలి ఎన్నికలు ఎలా ఎన్నికల ఖర్చుగా భారీగా తగ్గించగల్గుతాయని నిలదీశారు. 2004 లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 543 స్థానాల్లో తొలిసారిగా ఈవీఎంలను వాడినప్పుడు ఖర్చు భారీగా తగ్గిందనడానికి ఆధారాలున్నాయా? అని ప్రశ్నించారు.

దీటుగా బదులిచ్చిన ఎన్‌డీఏ కూటమి
దీనిపై బీజేపీ సభ్యులు సమాధానం ఇచ్చే ప్రయ త్నం చేశారు. ‘‘ 1957లో ఇలాగే ఏకకాల ఎన్ని కల కోసం అప్పుడు ఏడు రాష్ట్రాల అసెంబ్లీలను కాలపరిమితి ముగిసేలోపే కుదించారు. అప్పు డు రాష్ట్రపతిగా రాజేంద్రప్రసాద్‌ ఉన్నారు. ఆయ నే నాడు రాజ్యాంగ పరిషత్‌కు చైర్మన్‌ కూడా. ఆనాడు ఇలాంటి నిర్ణయం తీసుకున్న దిగ్గజ ఎంపీలంతా నాడు నెహ్రూ హయాంలో పనిచేసిన వాళ్లే. ఆ లెక్కన వీళ్లంతా ఆనాడు రాజ్యాంగ ఉల్ల ంఘనకు పాల్పడినట్టా? అని బీజేపీ సభ్యుడు సంజయ్‌ 
జైశ్వాల్‌ ఎదురు ప్రశ్న వేశారు. 

తీవ్రంగా తప్పుబట్టిన విపక్షాలు
బిల్లులను విపక్ష పార్టీల సభ్యులు తప్పు బట్టారు. ‘‘ విస్తృతమైన అంశాలపై సుదీర్ఘంగా చర్చించాలి. బిల్లులపై చర్చించేందుకు కనీసం ఏడాదిపాటు సమయం ఇవ్వాలి’’ అని కమిటీకి సారథ్యం వహిస్తున్న మాజీ కేంద్ర మంత్రి పీపీ చౌదరిని విపక్ష సభ్యులు కోరారు. ఈవీఎంల స్థానంలో బ్యాలెట్‌ పేపర్‌ విధానం తేవాలని వైఎస్సార్‌సీపీ సభ్యులు వి.విజయసాయిరెడ్డి డిమాండ్‌ చేశారు. 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)