Breaking News

జమిలి ఎన్నికల బిల్లులు వాయిదా

Published on Sun, 12/15/2024 - 13:00

న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’ బిల్లు సోమవారం లోక్‌సభ ముందుకు రావడం లేదు. జమిలి ఎన్నికలకు సంబంధించి రాజ్యాంగ(129వ సవరణ) బిల్లు–2024, కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల(సవరణ) బిల్లు–2024ను పార్లమెంట్‌ దిగువ సభలో నేడు ప్రవేశపెట్టాలని తొలుత నిర్ణయించారు. ఈ మేరకు లోక్‌సభ బిజినెస్‌ జాబితాలో సైతం వీటిని చేర్చారు. కానీ, కేంద్ర ప్రభుత్వం పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. 

ఆదివారం సవరించిన బిజినెస్‌ జాబితా నుంచి ఈ రెండు బిల్లులను తొలగించారు. సోమవారం నాటి లోక్‌సభ అజెండాలో వీటిని చేర్చలేదు. అయితే, రెండు బిల్లులను ఈ వారమే సభలో ప్రవేశపెట్టనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ఈ నెల 20న ముగియనున్నాయి. ఆలోగానే బిల్లులు సభ ముందుకు రానున్నాయి. ప్రవేశపెట్టాలనుకుంటున్న బిల్లులను లోక్‌సభ స్పీకర్‌ అనుమతితో చివరి నిమిషంలోనైనా సప్లిమెంటరీ లిస్టు ఆఫ్‌ బిజినెస్‌ జాబితాలో చేర్చే వెసులుబాటు ప్రభుత్వానికి ఉంది. 

నిధుల కేటాయింపులకు సంబంధించిన కొన్ని డిమాండ్లపై సోమవారం లోక్‌సభలో చర్చించాల్సి ఉందని, అందుకే జమిలి ఎన్నికల బిల్లులను వాయిదా వేసినట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. లోక్‌సభతోపాటు రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడానికి ఉద్దేశించిన రెండు బిల్లుల వివరాలను నిబంధనల ప్రకారం గత వారమే లోక్‌సభ సభ్యులకు అందజేశారు. రాజ్యాంగ (129వ సవరణ) బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల(సవరణ) బిల్లుకు కేంద్ర కేబినెట్‌ ఈ నెల 12న ఆమోద ముద్ర వేసిన సంగతి తెలిసిందే.   

జమిలి బిల్లులకు మద్దతివ్వండి
లక్నో: ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’విధానాన్ని బీఎస్‌పీ అధినేత మాయావతి సమర్థించారు. ఎన్నికల ఖర్చు తగ్గుతుందని, సంక్షేమ కార్యక్రమాలు అంతరాయం లేకుండా కొనసాగుతాయని ఆమె చెప్పారు. పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే జమిలి బిల్లుకు మద్దతు పలకాలని ఇతర రాజకీయ పార్టీలను మాయావతి కోరారు. ఈ విషయంలో రాజకీయాలకు అతీతంగా అందరూ ఆలోచించాలన్నారు.

 

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)