Breaking News

వివాహేతర సంబంధంతో హత్య

Published on Mon, 01/27/2025 - 09:49

కర్ణాటక: వివాహేతర సంబంధం కారణంగా ఓ వ్యక్తి హతయ్యాడు. నిందితులు శవాన్ని జాతీయ రహదారిపై పడేసి ప్రమాదంలో మరణించినట్లుగా చిత్రీకరించాలని చూశారు. ముళబాగిలు పోలీసులు కేసు నమోదు చేసుకుని నలుగురు నిందితులను అరెస్టు చేశారు. ఈ ఘటన ముళబాగిలు పట్టణ సమీపంలోని దొడ్డగుర్కి రహదారిలో చోటు చేసుకుంది.

 బీహార్‌కు చెందిన ఉమేష్‌కుమార్‌ సింగ్‌ (39) పట్టణ సమీపంలోని జల్లి క్రషర్లో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అదే క్రషర్లో పనిచేస్తున్న ఒడిశాకు చెందిన శివాని అనే మహిళతో సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయాన్ని శివాని భర్త కౌశల్‌ పసిగట్టాడు. ఉమేష్‌కుమార్‌ సింగ్‌ను హత్య చేయాలని కల్బుర్గికి చెందిన రమేష్‌, సోమశేఖర్‌తో కలిసి పథకం రచించాడు. ఉమేష్‌కుమార్‌ను శుక్రవారం రాత్రి 7 గంటలకు శివాని సహాయంతో బయటకు రప్పించారు. కౌశిల్‌, రమేష్‌, సోమశేఖర్‌లు ఇనుప రాడ్లతో ఉమేష్‌కుమార్‌ తలపై బాదారు. 

దీంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఇతను ప్రమాదంలో మరణించినట్లుగా చిత్రీకరించడం కోసం శవాన్ని జాతీయ రహదారిపై పడేసి వెళ్లారు. ముళబాగిలు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టి కౌశిల్‌, రమేష్‌, సోమశేఖర్‌, శివానిని అదుపులోకి తీసుకున్నారు. వివాహేతర సంబంధంతోనే హత్య జరిగినట్లు తేలింది. దీంతో ఆ నలుగురినీ అరెస్ట్‌ చేశారు. నిందితులను బంధించిన పోలీసులను ఎస్పీ నిఖిల్‌, అడిషనల్‌ ఎస్పీ రశిశంకర్‌లు అభినందించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)