Breaking News

Bihar: కలుషిత నీరు తాగి బాలిక మృతి.. 9 మంది విద్యార్థులు అస్వస్థత

Published on Tue, 09/03/2024 - 13:33

నలంద: బీహార్‌లోని నలంద జిల్లాలోగల కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో కలుషిత నీరు తాగి ఒక బాలిక మృతి చెందగా, 9 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు. మృతిచెందిన బాలిక పాఠశాల విద్యార్థిని కాదని, పాఠశాలలోని తన స్నేహితురాలిని కలిసేందుకు వచ్చిందని నలంద జిల్లా అధికారులు చెబుతున్నారు. కలుషిత నీరు తాగి అనారోగ్యం బారినపడిన మరో 9 మంది బాలికలను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా నీటి నమూనాను అధికారులు పరీక్షల నిమిత్తం పంపారు.

నలంద జిల్లా మేజిస్ట్రేట్ శశాంక్ శుభాంకర్ మంగళవారం మాట్లాడుతూ పాఠశాల ఆవరణలోని ఆర్‌ఓ సిస్టమ్ దగ్గర నీటిని తాగిన కొంతమంది బాలికలు వాంతులు, కడుపునొప్పితో బాధపడ్డారన్నారు. వెంటనే వారిని  ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించామమన్నారు. అయితే చికిత్స పొందుతూ ఓ బాలిక మృతి చెందిందని తెలిపారు. అస్వస్థతకు గురైన తొమ్మిది మంది విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందన్నారు. పాఠశాలలోని ఆర్‌ఓ వ్యవస్థను సక్రమంగా నిర్వహించడం లేదని తమ దృష్టికి వచ్చిందని, దానిలోని నీటి నమూనాలను టెస్టింగ్‌ కోసం పంపించామన్నారు. పాఠశాల వార్డెన్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని జిల్లా యంత్రాంగం ఆదేశించింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు అతన్నిఅధికారులు సస్పెండ్ చేశారు.

#

Tags : 1

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)