Breaking News

ఢిల్లీలో అగ్ని ప్రమాదం.. ఒకరు మృతి!

Published on Tue, 11/14/2023 - 11:34

దేశరాజధాని ఢిల్లీలోని షకర్‌పూర్ ప్రాంతంలో చోటుచేసుకున్న భారీ అగ్నిప్రమాదంలో ఒక మహిళ మృతి చెందింది. తూర్పు ఢిల్లీలోని షకర్‌పూర్ ప్రాంతంలోని ఒక నివాస భవనంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఒక మహిళ మరణించగా, ఒక  చిన్నారి సహా 26 మందిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. 

మంటలు చెలరేగినప్పుడు భవనంలో 60 మంది ఉన్నారని, వీరిలో కొందరు భవనంపై నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. కాగా అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, 26 మందిని ప్రమాదం బారి నుంచి కాపాడారు. అలాగే మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. 

అగ్నిప్రమాదం జరిగిన సమయంలో భవనంలో తొక్కిసలాట జరిగింది. ‍ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కొన్ని గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అగ్నిమాపక సిబ్బంది భవనంలోని కిటికీ పక్కన నిచ్చెనను ఏర్పాటు చేసి, ప్రమాదంలో చిక్కుకున్నవారిని ఒక్కొక్కరిగా రక్షించారు. ప్రమాదం జరిగిన షకర్పూర్ ప్రాంతంలో వీధులు చాలా ఇరుకుగా ఉండడంతో మంటలను నియంత్రించేందుకు అగ్నిమాపక సిబ్బంది చాలా శ్రమించాల్సి వచ్చింది. 
ఇది కూడా చదవండి: హమాస్‌ చెరలో తొమ్మిది నెలల చిన్నారి.. విడుదలయ్యేనా?

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)