Breaking News

ఇక్కడ ఒక్క రోజు గడిస్తే.. బయట 2 వారాలు అవుతుందా?!

Published on Mon, 06/29/2026 - 18:02

భూత, భవిష్యత్, వర్తమాన కాలాల్లోకి వెళ్లడానికి టైమ్ మిషన్‌ను ఉపయోగించడం సినిమాల్లో చూశాం..! ఒక గ్రహంపై ఒక్క రోజు గడిపితే.. బయటి ప్రపంచానికి కొన్ని సంవత్సరాలవుతుందని ‘ఇంటర్‌స్టెల్లార్’ లాంటి సినిమాల్లో చూసి ఆశ్చర్యపోయాం..! అవన్నీ కేవలం సైన్స్ ఫిక్షన్ సినిమాలే అనుకున్నాం..! అయితే.. మన భూమి మీద కూడా నిజంగానే కాలం చాలా వేగంగా పరుగెత్తే వింత ప్రాంతాలు ఉన్నాయంటే మీరు నమ్ముతారా? మనం ఇంతకు ముందు వీడియోలో.. బృందావనంలోని 'నిధివన్‌'లో ఇప్పటికీ ద్వాపరయుగం కొనసాగుతోందని భక్తులు విశ్వసిస్తారని చెప్పుకున్నాం.

అదేవిధంగా.. పవిత్ర కైలాస శిఖరంపై కాలం ఊహించని వేగంతో పరుగెడుతుందంటే మీరు నమ్ముతారా?అక్కడ కేవలం ఒక్కరోజు గడిపితే.. బయటి ప్రపంచానికి రెండు వారాలతో సమానమవుతుందని, అక్కడకు వెళ్లినవారి జుట్టు, గోళ్లు విపరీతమైన వేగంతో పెరుగుతాయని చెబుతుంటారు! సైన్స్‌కు కూడా అంతుచిక్కని, ప్రకృతి నియమాలకు విరుద్ధంగా సాగే ఆ కైలాస పర్వత కాల గమనం వెనుక ఉన్న రహస్యాలేంటో.. 

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరంగా పేరున్న ఎవరెస్టును ఇప్పటి వరకు కొన్ని వేల మంది అధిరోహించారు. కానీ, దానికంటే తక్కువ ఎత్తు ఉన్న కైలాస శిఖరాన్ని మాత్రం ఇప్పటి వరకు ఒక్క పర్వతారోహకుడు కూడా అధిరోహించలేకపోయాడు. ఎందుకంటే.. కైలాస శిఖరం పరమశివుడికి నివాస స్థానం. ఆ కైలాస శిఖరం దగ్గరకు వెళ్తే.. వయసు వేగంగా పెరిగిపోతుంది. సైన్స్ సైతం అంగీకరించిన నిగూఢ అంతరిక్ష రహస్యం వెనక మిస్టరీ ఇప్పటికీ వీడలేదు. గతంలో దీనిపై జరిగిన చరిత్రాత్మక పరిశోధనల్లో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. కైలాస పర్వతానికి సమీపంగా వెళ్లేవారు వింత అనుభవాలకు గురవుతారు. అక్కడ కాలం వేగంగా కదలడం.. గోళ్లు, జుట్టు విపరీతంగా పెరిగిపోవడం వంటి పరిణామాలను గుర్తిస్తారు. అంటే.. బయటి ప్రపంచంలో రెండు వారాల్లో జరిగే మార్పులు.. ఇక్కడ ఒక్కరోజులో చోటుచేసుకోవడం గమనార్హం..!

కైలాస శిఖరం వద్ద కాల గమన వింతపై గత కొన్ని దశాబ్దాలుగా అంతర్జాతీయ శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు చేశారు. 1926వ సంవత్సరంలో.. బ్రిటిష్ పర్వతారోహకుడు హ్యూ రూట్లేజ్ కైలాస పర్వతాన్ని పరిశోధించి, దీని చుట్టూ ఏదో అదృశ్య శక్తి ఉందని, దీనిని అధిరోహించడం అసాధ్యమని తన డైరీలో రాసుకున్నారు. 1999వ సంవత్సరంలో రష్యాకు చెందిన ప్రఖ్యాత కంటి సర్జన్, సైంటిస్ట్ డాక్టర్ ఎర్నెస్ట్ ముల్దాషేవ్ నేతృత్వంలోని జియాలజిస్టులు, ఫిజిసిస్టుల బృందం కైలాస పర్వతంపై ఒక సంచలన పరిశోధన చేసింది. వారి నివేదిక ప్రకారం.. కైలాస పర్వతం అనేది ఒక సహజమైన కొండ కాదు. అది మానవాతీత శక్తులు లేదా ప్రాచీన సాంకేతికతతో నిర్మితమైన ఒక భారీ 'రాతి పిరమిడ్' అని తేలింది.  ఈ పర్వతం చుట్టూ వందలాది చిన్న చిన్న పిరమిడ్లు కలిసి ఉన్నాయని ఆ నివేదికలో పేర్కొన్నారు. 2015-16 కాలంలో.. ఆధునిక క్వాంటమ్ ఫిజిక్స్ పరిశోధకులు ఇక్కడి ఎనర్జీ గ్రిడ్‌లను మ్యాప్ చేశారు. పిరమిడ్ ఆకారంతోపాటు.. తీవ్రమైన కాస్మిక్ ఎనర్జీ రేడియేషన్ వల్ల అక్కడ 'టైమ్ డైలేషన్' జరుగుతోందని, అందుకే అక్కడ సమయం వేగంగా ముందుకు సాగుతుందని సైన్స్ పరంగా నిర్ధారించారు.

ఆధునిక విజ్ఞాన శాస్త్రం దీన్ని పిరమిడ్ ఎఫెక్ట్ లేదా మాగ్నెటిక్ ఫోర్స్ అంటుంటే.. మన పురాణాలు మాత్రం దీన్ని విశ్వానికి కేంద్ర బిందువు అయిన 'యాక్సిస్ ముండి' అని వేల ఏళ్ల క్రితమే చెప్పాయి. ఉత్తర ధ్రువానికి, దక్షిణ ధ్రువానికి సరిగ్గా.. మధ్యలో.. భూమికి, ఆకాశానికి వారధిలా ఈ కైలాస పర్వతం ఉంది. ఇక్కడి నుంచే విశ్వ శక్తి అంటే కాస్మిక్ ఎనర్జీ భూమి పైకి వస్తుందని చెబుతారు. పురాణాల ప్రకారం.. సిద్ధ పురుషులు, కిన్నెరులు నేటికీ ఇక్కడ సూక్ష్మ రూపంలో సంచరిస్తూ ఉంటారు. వారు ఉన్నతమైన లోకాలకు ప్రయాణించడానికి వీలుగా ఇక్కడ కాలం వేగాన్ని మార్చినట్లు తెలుస్తోంది.

చూశారు కదా? సైన్స్ ఎంతగా అభివృద్ధి చెందినా.. స్పేస్ రీసెర్చ్‌లు నెక్స్ట్ లెవల్‌లో జరుగుతున్నా.. కైలాస పర్వతం చుట్టూ ఉన్న కాల ప్రవాహ రహస్యాన్ని మాత్రం పూర్తిగా డీకోడ్ చేయలేకపోయారు మన శాస్త్రవేత్తలు. అక్కడ గడియారాలు తప్పు చూపిస్తాయి, దిక్సూచి అంటే.. కంపాస్ పనిచేయదు. రష్యా శాస్త్రవేత్తల నివేదికలు సైతం అంగీకరించిన ఈ కాల గమన వింత.. పరమశివుడి అనంత శక్తికి ఒక సజీవ సాక్ష్యం. ప్రకృతి, పరమాత్మ దాచిన ఈ కైలాస కోడ్ ఎప్పటికీ ఒక పవిత్ర మిస్టరీనే! దీనిపై మీరేమంటారు? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లైతే.. ఈ వీడియోను లైక్ చేయండి.. షేర్ చేయండి.. ఇలాంటి మరిన్ని అప్‌డేట్స్ మిస్సవ్వకుండా ఉండేందుకు మా చానల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి..
 

 

Videos

నిప్పుల కొలిమిగా యూరప్... పిట్టలా రాలిపోతున్న జనాలు!

2029లో మీరు రాజారెడ్డి మనవడిని చూస్తారు..! ఒక్కొక్కడికీ ఊచకోతే..!

జులైలో వానలు! విశాఖ IMD గుడ్ న్యూస్

YS జగన్ ను కలిసిన సింగపూర్ కాన్సులేట్ జనరల్

కేతన్ హత్య కేసులో బయటపడుతున్న కీలక ఆధారాలు.. మరో సంచలన ట్విస్ట్!

మినిమం కామన్ సెన్స్ లేదా... ఏమ్మా హోమ్ మినిస్టర్, ఏం చేస్తున్నావ్..!

High Tension: చంద్రబాబు ఇంటిని ముట్టడి బారు గేట్లు లాగిపడేసిన రైతులు

సాయికృష్ణ కేసులో RMP డాక్టర్ చెప్పిన నమ్మలేని నిజాలు

ఫేస్ యాప్ దుర్వినియోగం? ఉపాధి హామీలో టీడీపీ అక్రమాలు

రికార్డులు బద్దలు కొట్టిన సమంత.. అనుష్కను దాటేసింది!

Photos

+5

అక్కినేని అఖిల్‌ ‘లెనిన్‌’ మూవీ HD స్టిల్స్‌

+5

‘హ్యాంగ్‌మ్యాన్’ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

‘ఆల్ఫా’ మూవీ ప్రమోషన్‌లో సందడి చేసిన అలియా భట్ (ఫొటోలు)

+5

గ్లామరస్‌గా సింగ్ గీతం బ్యూటీ నివేదా పేతురాజ్.. (ఫోటోలు)

+5

రొట్టెల పండగ : స్వర్ణాల తీరం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

అందాల అదితీ రావు హైదరీ (ఫొటోలు)

+5

రకుల్.. అదిరెన్ నీ సొగసులు! (ఫొటోలు)

+5

లార్డ్స్ మైదానంలో సందడి చేసిన కోహ్లి-ధావన్ ఫ్యామిలీస్! (ఫోటోలు)

+5

ఫ్యామిలీతో హీరోయిన్ మధుబాల స్పెషల్ మూమెంట్స్ (ఫొటోలు)

+5

బాలీవుడ్ భామ ప్రగ్యా కపూర్ బర్త్‌ డే.. తమన్నా సందడి (ఫోటోలు)