Breaking News

నేడు ఒమర్‌ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం

Published on Wed, 10/16/2024 - 04:26

శ్రీనగర్‌: కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్‌ తొలి ముఖ్యమంత్రిగా నేషనల్‌ కాన్ఫరెన్స్‌(ఎన్‌సీ) ఉపాధ్యక్షుడు ఒమర్‌ అబ్దుల్లా నేడు ప్రమాణం చేయనున్నారు. ఆర్టీకల్‌ 370 ఆర్టీకల్‌ రద్దు అనంతరం మొదటిసారిగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్‌సీ, కాంగ్రెస్‌ కూటమి విజయం సాధించడం తెలిసిందే. బుధవారం శ్రీనగర్‌లోని షేర్‌–ఇ–కశ్మీర్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌(ఎస్‌కేఐసీసీ)లో జరిగే కార్యక్రమంలో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా సీఎంగా ఒమర్‌తో ప్రమాణం చేయించనున్నారు.

పలువురు మంత్రులుగా ప్రమాణం చేస్తార ని భావిస్తున్నారు. ఇందుకోసం ఎస్‌కేఐసీసీలో భారీగా బందోబస్తు ఏర్పాట్లు చేపట్టారు. కార్యక్రమానికి ఇండియా కూటమి పార్టీల నేతలు ఈ కార్యక్రమానికి హాజరవుతారని భావిస్తున్నారు. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ నామినేట్‌ చేసిన ఐదుగురితో కలుపుకుంటే జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ సభ్యుల సంఖ్య 95కు చేరుకుంది. ఇటీవలి ఎన్నికల్లో ఎన్‌సీ 40, భాగస్వామ్య కాంగ్రెస్‌ ఆరు, సీపీఎం ఒక సీటు గెలుచుకున్నాయి. ఇవికాకుండా, ఒమర్‌ అబ్దుల్లాకు ఆప్‌ ఏకైక సభ్యుడు, ఐదుగురు ఇండిపెండెంట్లు మద్దతు పలికారు. 

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)