Breaking News

రాష్ట్ర హోదా త్వరగా రావాలి

Published on Thu, 10/17/2024 - 04:01

శ్రీనగర్‌: కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కశ్మీర్‌కు తొలి సీఎంగా బుధవారం బాధ్య తలు స్వీకరించిన కొద్దిసేపటికే పీటీఐ వీడియోస్‌తో ఒమర్‌ అబ్దుల్లా ముఖాముఖి మాట్లాడారు. జమ్మూకశ్మీర్‌కు త్వరలోనే రాష్ట్ర హోదా వస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ‘‘ కాంగ్రెస్‌ పార్టీతో కలిసి రాష్ట్ర హోదా సాధనకు కృషిచేస్తాం. త్వరలోనే రాష్ట్ర హోదా దక్కొచ్చని భావిస్తున్నాం. ఖాళీగా ఉన్న మంత్రిపదవుల భర్తీ కోసం కాంగ్రెస్‌తో చర్చలు జరుపుతున్నాం. 

కాంగ్రెస్‌తో బేధాభి ప్రాయా లు అబద్ధం. నిజంగానే సఖ్యత చెడితే ఖర్గే, రాహుల్‌ గాంధీ, ప్రియాంక వంటి అగ్రనేతలు మా ప్రమాణ స్వీకార కార్య క్రమానికి రారుకదా. ప్రభు త్వంలో చేరాలా వద్దా అనేది వాళ్ల ఇష్టం. శాసనమండలి కూడా లేని జమ్మూ కశ్మీర్‌లో తక్కువ మంది మంత్రులతో ప్రభు త్వాన్ని నడపాలని భావిస్తున్నాం. గతంలోలాగా 40, 45 మంది మంత్రులుండే కాలం పోయింది. 2018 నుంచి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కశ్మీర్‌లో లేదు. 

తమ సమస్యల్ని పట్టించుకున్న నాథుడే లేడని ప్రజలు నిరాశలో కుంగిపోయారు. అందుకే కొత్తగా ఏర్పడిన మా ప్రభుత్వ తక్షణ కర్తవ్యం వారి సమస్యలను పరిష్కరించడమే. కేంద్రపాలిత ప్రాంతంగా కశ్మీర్‌ను పాలించడం కొత్త రకం సవాల్‌. అందివచ్చిన తొలి అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోవడం పెద్ద నేరంతో సమానం. గత తప్పిదాలు చేయబోను. కేజ్రీవాల్‌సహా దేశంలో పరిపా లనా అనుభవం ఉన్న కీలక వ్యక్తులు అందరి నుంచి పాఠాలు నేర్చుకుంటా’’ అని ఒమర్‌ వ్యాఖ్యానించారు.

Videos

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు