Breaking News

కోచింగ్‌ సెంటర్‌లో ప్రాణాలు కోల్పోయి.. శ్రేయ విషాద గాథ

Published on Sun, 07/28/2024 - 13:35

ఢిల్లీలోని ఒక కోచింగ్ సెంటర్‌లోకి ప్రవేశించిన నీటిలో మునిగి ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు.  ఈ వార్త తెలిసిన మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ మృతులలో ఒకరే శ్రేయ. ఉన్నత అధికారి కావాలనుకున్న కుమార్తె కలలను నెరవేర్చాలనే ఉద్దేశంతో శ్రేయ కుటుంబ సభ్యులు రెండు నెలల క్రితమే ఆమెను పోటీ పరీక్షల కోచింగ్‌ కోసం ఢిల్లీకి పంపించారు.

శ్రేయ కుటుంబ సభ్యులు యూపీలోని అంబేద్కర్ నగర్‌లో ఉంటారు. గత మేనెలో శ్రేయ.. రావ్‌ కోచింగ్ సెంటర్‌లో అడ్మిషన్ తీసుకుంది. శ్రేయ తన ఇంటిలో మొదటి సంతానం. చిన్నప్పటి నుంచి చదువులో చురుకుగా ఉండే శ్రేయపై తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.  ఆమె తండ్రి రాజేంద్ర యాదవ్ తన కుమార్తెను  ఐఏఎస్‌గా చూడాలని తపన పడేవాడు. శ్రేయ రెండు నెలల నుంచి కోచింగ్ సెంటర్‌లోనే శిక్షణ తీసుకుంటోంది. ఈ కోచింగ్‌ సెంటర్‌ బేస్‌మెంట్‌లో లైబ్రరీ  ఉంది. శనివారం సాయంత్రం ఆ  లైబ్రరీలో శ్రేయతో పాటు మరికొందరు విద్యార్థులు కూడా చదువుకుంటున్నారు.

ఉన్నట్టుండి భారీ వర్షం రావడంతో  బేస్‌మెంట్‌లోకి వరద నీరు ప్రవేశించి, అది లైబ్రరీని ముంచెత్తింది. దీంతో లైబ్రరీ వరద నీటితో నిండిపోయింది. ఫలితంగా విద్యార్థులంతా లైబ్రరీలో చిక్కుకుపోయారు. బయట నుంచి రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించారు. అయితే అప్పటికే ముగ్గురు విద్యార్థులు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న శ్రేయ కుటుంబ సభ్యులు విషాదంలో కూరుకుపోయారు. శ్రేయ ఇద్దరు తమ్ముళ్లు తమ అక్కను గుర్తు చేసుకుంటూ రోదిస్తున్నారు. కుమార్తెను ఐఏఎస్‌గా చూడాలనుకున్న శ్రేయ తల్లిదండ్రుల వేదన వర్ణనాతీతంగా మారింది.

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)