Breaking News

నా లిమిట్స్ నాకు తెలుసు: డీకే శివకుమార్

Published on Sun, 11/30/2025 - 15:13

సాక్షి బెంగుళూరు:గత కొంతకాలంగా జాతీయ రాజకీయాలని వేడెక్కించిన కర్ణాటక పాలిటిక్స్ ఇప్పుడు కాస్త చల్లబడ్డట్లు కనిపిస్తున్నాయి. సీఎం సిద్ధరామయ్యతో తనకు విభేదాలు ఏమి లేవని డిప్యూటీ సీఎం డీ.కే శివకుమార్ ప్రకటించారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా తన లిమిట్స్ ఏంటో తనకు తెలుసన్నారు. తమ పార్టీ నేతల దృష్టంతా 2028లో పార్టీని అధికారంలోకి తేవడం పైనే ఉందన్నారు.

కర్ణాటక కాంగ్రెస్‌లో పుట్టిన అంతర్గత ముసలం గత కొద్దిరోజులుగా దేశ రాజకీయాల్లో హాట్‌టాఫిక్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్ర సీఎం సిద్ధ రామయ్య, డిప్యూటీ సీఎం డీ.కే శివకూమార్ మధ్య ట్వీట్ల యుద్ధం తీవ్రంగానే నడిచింది. తనను ఐదు సంవత్సరాల కొరకు ప్రజలు ఎన్నుకున్నారని సిద్ధ రామయ్య, మాట నిలబెట్టుకోవడం కంటే గొప్పది మరోటి ఉండదని శివకుమార్ కామెంట్స్ చేశారు. కాగా ప్రస్తుతం శివకుమార్ మాట్లాడే తీరు చూస్తుంటే ఈ విషయంలో ఆయన కొంచెం మెత్తబడ్డట్లే కనిపిస్తుంది.

డీ.కే శివకుమార్ మాట్లాడుతూ  "ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నా మధ్య ఎలాంటి విభేదాలు లేవు. పార్టీ అధ్యక్షుడిగా నా పరిధులేంటో నాకు తెలుసు. ఇప్పటి వరకూ తామేప్పుడు భేదాభిప్రాయాలు వ్యక్తం చేయలేదు. మేమిద్దరం కలిసే పని చేస్తున్నాం. కర్ణాటక ప్రజలకు వారి భవిష్యత్తు మీద ఎన్నో ఆశలున్నాయి. వాటిని నెరవేర్చడం కోసం మేమంతా కలిసి పనిచేయాలనుకుంటున్నాం. 2028, 2029లో అధికారం సాధించడమే మా ముందున్న గమ్యం. దానికోసం మేం పనిచేస్తున్నాం. వివిధ సమస్యలపై అన్ని పార్టీలతో సమావేశం ఏర్పాటు చేయాలనుకుంటున్నాం". అని శివకుమార్ అన్నారు.

కాగా  నవంబర్ 20న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడవడంతో  సీఎం మార్పు జరగనుందని పెద్దఎత్తున ప్రచారం జరిగింది. అధికారంలోకి వచ్చినప్పుడే సీఎం మార్పు జరిగేలా అగ్రిమెంట్ జరిగిందని దానికనుంగానే నిర్ణయం తీసుకోనున్నారని ఊహాగానాలు  చెలరేగాయి. కాగా ప్రస్తుతం సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం శివకూమర్ ఇద్దరూ నేతలు సైతం అధిష్ఠానందే ఫైనల్ డెసిషన్ అనడంతో కాంగ్రెస్ హైకమాండ్‌ ఊపిరి తీసుకున్నట్లు కనిపిస్తుంది.

ఈ వివాదం పై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే త్వరలోనే పార్టీ హైకమాండ్‌తో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)