Breaking News

అప్పుడే మండుతున్న ఎండలు.. 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

Published on Mon, 03/17/2025 - 07:08

న్యూఢిల్లీ: దేశంలో అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. ఛత్తీస్‌గఢ్-ఒడిశా తదితర రాష్ట్రాల్లో గరిష్ట ఉష్ణోగ్రత(Maximum temperature) 40 డిగ్రీల సెల్సియస్ కంటే  అధికంగా నమోదవుతోంది. ఢిల్లీలో పెరుగుతున్న వేడి, బలమైన గాలుల కారణంగా గాలి నాణ్యత మెరుగుపడింది. రాబోయే రోజుల్లో దేశంలోని అన్ని ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లలో వేడి గాలులు వీయనున్నాయని వాతావరణశాఖ(Meteorological Department) హెచ్చరిక జారీ చేసింది. ఈ సంవత్సరం సాధారణం కంటే  అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయని వాతావరణ శాస్త్రవేత్తలు ఇప్పటికే అంచనా వేశారు. ఒడిశాలోని బౌద్‌లో ఆదివారం గరిష్ట ఉష్ణోగ్రత 43.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైందని వాతావరణశాఖ తెలిపింది. ఝార్సుగూడలో గరిష్ట ఉష్ణోగ్రత 42 డిగ్రీల సెల్సియస్, బోలాంగీర్‌లో 41.7 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. మహారాష్ట్రలోని చంద్రపూర్ 41.6 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బౌద్‌లో శనివారం ఉష్ణోగ్రతలు 42.5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి.

ఒడిశాలోని పశ్చిమ ప్రాంతంలో ఆదివారం వేడిగాలులు వీచాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని ఏడు ప్రదేశాలలో 40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఝార్సుగూడ, సంబల్పూర్, కలహండిలకు సోమవారం వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు మార్చి 19 నుండి నాలుగు రోజుల పాటు దేశంలోని కొన్ని ప్రాంతాలలో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేసింది. ఈ సమయంలో వేడి నుండి  కాస్త ఉపశమనం లభిస్తుందని వాతావరణశాఖ పేర్కొంది.

కాగా ఢిల్లీలో గాలి నాణ్యత వరుసగా రెండవ రోజు ఆదివారం సంతృప్తికరమైన విభాగంలోనే ఉంది. ఏక్యూఐ 99 వద్ద నమోదైంది. 2025లో గాలి నాణ్యత సంతృప్తికరమైన విభాగంలో నమోదైన మొదటి రోజు కూడా ఇదే. ఆదివారం ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైందని, ఇది సాధారణం కంటే మూడు డిగ్రీలు ఎక్కువని, కనిష్ట ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైందని వాతావరణశాఖ పేర్కొంది.

ఇది కూడా చదవండి: ర్యాపిడ్‌ రైలు కారిడార్‌పై వర్క్‌ స్పేస్‌.. ప్రయోజనమిదే..

Videos

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)